కరోనా బీభత్సం : భయపెడుతున్న సెప్టెంబర్ ?

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ మహమ్మారి భారత్ లోనూ, తన దూకుడు ప్రదర్శిస్తోంది.అడ్డు అదుపు లేనట్టుగా విజృంభిస్తున్న తీరు అందరిని ఆందోళనకు గురి చేస్తోంది.

గతంలో కంటే రెండు మూడు రెట్లు ఎక్కువ స్థాయిలో ప్రస్తుతం కేసులు నమోదవుతున్నాయి.పట్టణాల నుంచి పల్లెల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నాయి.

ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరిగిపోతుండడంతో, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన చెందుతున్నాయి.ఇక ప్రజల్లోనూ కరోనా భయం ఎక్కువగా ఉంది.భారతదేశంలో కోటికి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.20 వేల వరకు మరణాలు సంభవించాయి.ముందు ముందు ఈ వైరస్ ప్రభావం మరింతగా ఉండే అవకాశం ఉందనే వార్తలు అందరిని కలవరానికి గురిచేస్తున్నాయి.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సమయంలో కేసుల సంఖ్య తక్కువగా నమోదయ్యాయి.పరిస్థితి చాలా వరకు అదుపులోకి వచ్చింది.రోజుకు వెయ్యి కేసుల కంటే తక్కువగానే నమోదయ్యాయి.

Advertisement

ఎప్పుడైతే లాక్ డౌన్ ఎత్తివేశారో, అప్పటి నుంచి పరిస్థితి అదుపు చేయడం కష్టతరంగా మారింది.ఒక్క జూన్ నెలలోనే 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి.

ఈ సమయంలోనే ఈ వైరస్ మహమ్మారి గురించి మరో సంచలన విషయం బయట పడింది.సెప్టెంబర్ వరకు ఈ కరోనా ప్రభావం ఇంత కంటే తీవ్ర స్థాయిలో ఉంటుందని, సెప్టెంబర్ నెలలో ఈ వైరస్ ప్రభావం ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందని, కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య బాగా పెరుగుతాయి అని, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా మరో సారి లాక్ డౌన్ విధిస్తారా అనే చర్చ మొదలైంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించాయి .మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 2 లక్షలు దాటగా, తమిళనాడులో లక్ష కేసులకు పైనే నమోదయ్యాయి.ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తూ ఉండడంతో చాలా రాష్ట్రాలు మరోసారి పూర్తిగా లాక్ డౌన్ విధించాలని కోరుతున్నాయి.

ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం ఈ విషయంపై పూర్తి స్థాయిలో కసరత్తు మొదలు పెట్టారు.రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతున్నట్టుగా కనిపిస్తుండడంతో, కేంద్రంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి నెలకొంది.

నిత్యం ఈ పొడిని తీసుకుంటే కళ్ళ‌జోడుకు మీరు శాశ్వతంగా గుడ్ బై చెప్పొచ్చు!
చిరంజీవి విలన్ గా బాలీవుడ్ నటుడు..  మేకర్స్ పోస్ట్ వైరల్!

ఈ పరిస్థితిని అదుపు చేయకపోతే, ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటంతో పాటు, కేంద్రం అభాసుపాలవుతుంది.ఈ నేపథ్యంలో తమపై ఒత్తిడి పెరిగిపోతుండడంతో ఏం చేయాలనే విషయంపై ప్రధాని కూడా టెన్షన్ పడుతున్నారనే వార్తలు వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు