ఇండియాలో 23 లక్షలకు చేరిన కరోనా కేసులు..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కలోల్లం సృష్టిస్తుంది.రోజు రోజుకు ఈ వైరస్ బారినపడే వారి సంఖ్యా పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గడం లేదు.

ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.ఇంకా కరోనా బారినపడి కొన్ని వేల మంది ఆసుపత్రిలలో చికిత్స పొందుతున్నారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.తాజాగా దేశంలో కరోనా కేసులు సంఖ్య 23 లక్షలు చేరింది.

దేశంలో గడిచిన 24గంటల్లో 60,963 నమోదైయ్యాయి.అంతేకాదు ఒక్కరోజులోనే ఈ మహమ్మారి బారినపడి 834 మంది ప్రాణాలను కోల్పోయారు.

Advertisement

అయితే గడిచిన 24 గంటల్లో దేశం మొత్తంలో 47,746 మంది ఈ మహమ్మారి నుండి కోలుకొని ఇంటికి చేరారు.దేశవ్యాప్తంగా 23,29,638 కేసులు నమోదయ్యాయి.

అయితే అందులో ప్రస్తుతం 6,43,948 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అంతేకాక 13,39,599 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

అంతేకాకుండా దేశంలో 46,091 మంది కరోనా వ్యాధితో మృతి చెందారు.ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70.38 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు