ఈ గ్రీన్ స్మూతీని వారంలో ఒక్కసారి తీసుకున్న చాలు.. వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో బెనిఫిట్స్!

ఇటీవల కాలంలో మధుమేహం, ఊబకాయం, గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.

అయితే ఆయా జబ్బులు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే గ్రీన్ స్మూతీని వారంలో ఒక్కసారి తీసుకున్న చాలు వెయిట్ లాస్ నుంచి షుగర్ కంట్రోల్ వరకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.

మరి ఇంతకీ ఆ గ్రీన్ స్మూతీ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వాటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బ్లెండర్ తీసుకుని అందులో అరకప్పు పైనాపిల్( Pineapple ) ముక్కలు వేసుకోవాలి.అలాగే అరకప్పు కివీ పండు ముక్కలు, అర కప్పు గ్రీన్ ఆపిల్ ముక్కలు వేసుకోవాలి.వీటితో పాటు మూడు ఫ్రెష్ పాలకూర ఆకులు, వన్ టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు ఒక గ్లాస్ ఫ్రెష్ కొబ్బరినీళ్లు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement

తద్వారా మన గ్రీన్ స్మూతీ సిద్ధం అవుతుంది.

చూడడానికి చాలా ఆకర్షణీయంగా కనిపించే ఈ గ్రీన్‌ స్మూతీ రుచి కూడా బాగుంటుంది.అలాగే ఆరోగ్యానికి ఈ స్మూతీ ఎంతో మేలు చేస్తుంది.వారంలో కనీసం ఒక్కసారి ఈ స్మూతీని తీసుకుంటే శరీరంలో అదనపు కేలరీలు వేగంగా కరుగుతాయి.

బరువు తగ్గుతారు.అలాగే ఈ స్మూతీ రక్తంలో చక్కెర స్థాయిల‌ను నియంత్రణలో ఉంచుతుంది.

అదే సమయంలో బాడీలో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను బయటకు పంపుతుంది.బాడీని డీటాక్స్ చేస్తుంది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఈ గ్రీన్ స్మూతీలో ఉంటాయి.అంతేకాదు డైట్ లో ఈ స్మూతీని చేర్చుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరుగుతుంది.

Advertisement

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.మెదడు కూడా సూపర్ షార్ప్ గా పని చేస్తుంది.

తాజా వార్తలు