ఈనెల 10న కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ

కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ఈనెల 10వ తేదీన జరగనుంది.ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ అగ్రనేతల బస్సు యాత్రపై చర్చించనున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా హస్తం పార్టీ తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది.

ఆ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారని తెలుస్తోంది.ఈ మేరకు ఈనెల 15, 16వ తేదీల్లో ప్రియాంక గాంధీ అదేవిధంగా 18, 19 తేదీల్లో రాహుల్ గాంధీ బస్సు యాత్ర నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో పార్టీ అగ్రనేతల ప్రచార రూట్ మ్యాప్ పై పీఏసీ సభ్యులు చర్చించనున్నారు.

Advertisement
హే ప్రభూ.. ఏంటి ఈ విడ్డురం.. బస్సు అనుకుంటే పొరపాటే సుమీ..

తాజా వార్తలు