అచ్చంపేట ఘటనపై ఈసీకి కాంగ్రెస్ నేత ఫిర్యాదు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటలో చోటు చేసుకున్న ఘటనపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు.

కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణను అచ్చంపేట సీఐ అనుదీప్ బెదిరించిన వీడియోను కాంగ్రెస్ నేత నిరంజన్ తన ఫిర్యాదు కాపీతో జత చేశారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్ వాళ్లకు సినిమా చూపిస్తానని బెదిరించారని సీఐపై ఆరోపణలు చేశారు.అంతేకాకుండా బీఆర్ఎస్ కు సీఐ అనుకూలంగా పని చేస్తున్నారని నిరంజన్ విమర్శించారు.

ఈ క్రమంలో సీఐ అనుదీప్ పై చర్యలు తీసుకోవాలని నిరంజన్ ఈసీకి విన్నవించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు