కాంగ్రెస్ పెద్ద ప్లానే..?

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీ( Congress party ) హడావిడి మామూలుగా లేదు.

ఒకవైపు పార్టీని ప్రజల్లో మరింతగా ముందుకు తీసుకెళుతూనే మరోవైపు ఇతర పార్టీలనుంచి నేతలను ఆహ్వానిస్తున్నారు టి కాంగ్రెస్ నేతలు.

ముఖ్యంగా అధికార బి‌ఆర్‌ఎస్ టార్గెట్ గా మొదలు పెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ గట్టిగానే సక్సస్ అవుతోంది.గత నెలలో బి‌ఆర్‌ఎస్ తొలి జాబితా అభ్యర్థులను ప్రకటించగా.టికెట్ దక్కని చాలమంది నేతలు బి‌ఆర్‌ఎస్ పై తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కుతూ వచ్చారు

అలా అసంతృప్త నేతలందరిని హస్తం పార్టీ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ నేతలు విజయం సాధించరనే చెప్పాలి.ఇప్పటికే చాలమంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరుకోగా మరికొంత మంది కూడా కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈనెల 17 న కాంగ్రెస్ పార్టీ ఓ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది.

ఈ సభకు సోనియాగాంధీ( Sonia Gandhi ) తోపాటు పలువురు జాతీయ నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని టాక్.కాగా సభలో బి‌ఆర్‌ఎస్ ఊహించని విధంగా చేరికలు ఉడబోతున్నాయని కాంగ్రెస్ వర్గంలో చర్చ జరుగుతోంది.

Advertisement

ఇప్పటికే తుమ్మల,( Tummala Nageswara Rao ) మైనంపల్లి( Mynampally Hanumanth Rao ) వంటి నేతలు బి‌ఆర్‌ఎస్ పై అసహనంగా ఉన్న నేపథ్యంలో వారుతో టి కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపారు.దాంతో 17 నా అధికారికంగా వీరు హస్తం గూటికి చేరే అవకాశం ఉంది.ఇక ఇదే రోజున మేనిఫెస్టో కూడా ప్రకటించబోతున్నాట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆ మద్య స్పష్టం చేశారు.

మేనిఫెస్టోతో పాటు తొలి జాబితా అభ్యర్థులను కూడా ఇదే రోజున ప్రకటించే అవకాశం ఉందని టాక్.మొత్తానికి పార్టీ ఈ నెల 17 పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది.

మరి ఆ తరువాత నుంచి పూర్తి స్థాయిలో ప్రచారంపై దృష్టి సారించనున్నారట హస్తం నేతలు.ప్రస్తుతం సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని ఈసారి గెలుపు తమదే అని చెబుతున్నా కాంగ్రెస్ పార్టీ మరి ఈ ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ కు చెక్ పెడుతుందో లేదో చూడాలి.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు