అన్నపూర్ణమ్మ కి దేవదాస్ కనకాల కి మధ్య ఉన్న గొడవ ఏంటో మీకు తెలుసా...?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ మంచి సినిమాలు చేస్తూ ఉంటారు అనే విషయం మన అందరికి తెలిసిందే.

ప్రస్తుతం చాలామంది సినిమాల్లో మంచి క్యారెక్టర్లు చేస్తూ నటులుగా మంచి గుర్తింపు సాధించుకుంటున్నారు అయితే ఒకప్పుడు హీరోయిన్ గా చేసి తర్వాత అక్కగా చాలా సినిమాల్లో నటించి ఆ తర్వాత తల్లిగా చేసిన నటులు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు.

వాళ్ళలో అన్నపూర్ణమ్మ ఒకరు ఆవిడ తల్లి పాత్రలకు బాగా ఫేమస్ అని చెప్పాలి.మొదటగా హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఒకటి రెండు సినిమాలు చేసిన తర్వాత తనకి హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రెస్ట్ లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది తెలుగులో ఆమె చాలా సినిమాల్లో నటించి తనదైన మార్కు నటనతో ప్రేక్షకులలో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

చిరంజీవి దగ్గర్నుంచి అగ్రహీరోలు అందరికీ అప్పట్లో తల్లి పాత్రలు పోషించి నటిగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ అందుకుంది.ప్రస్తుతం ఆవిడ నానమ్మ పాత్రలు అమ్మమ్మ పాత్రలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

అయితే ఆవిడ నటిగా బిజీగా ఉన్న సమయంలోనే రాజీవ్ కనకాల ఫాదర్ అయిన దేవదాస్ కనకాల ఆమెకి ఒక ల్యాండ్ అమ్మరు అది వివాదంలో ఉండడంతో చాలాసార్లు దేవదాస్ కనకాలతో ఆవిడ ల్యాండ్ గురించి అడిగినప్పటికీ రెస్పాండ్ అవ్వలేదు.ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అయిన రాజీవ్ కనకాలకి కాల్ చేస్తే అతను ఫోన్ ఎప్పుడూ బిజీగానే వస్తుంది అని ఆవిడ ఎవరికి చెప్పాలో అర్థం కాక అలా వదిలేసింది అని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Advertisement
Conflicts Between Annapurnamma And Devadas Kanakala, Annapurnamma, Devdas Kanaka

తన ల్యాండ్ వాల్యూ చూసుకొని వేరే దగ్గర ల్యాండ్ ఇచ్చిన పర్లేదు అని అప్పట్లో దేవదాస్ కనకాలతో చెప్పినప్పటికీ ఆయన పెద్దగా రెస్పాండ్ కాకపోవడం తో అలానే వదిలేసింది.

Conflicts Between Annapurnamma And Devadas Kanakala, Annapurnamma, Devdas Kanaka

ప్రస్తుతం అన్నపూర్ణ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది అలాగే ఇప్పుడు ఆమె వాళ్ళ ఫ్యామిలీతో పాటు హ్యాపీ గా తన జీవితాన్ని కొనసాగిస్తుంది అయితే అప్పట్లో సినిమాల్లో నటించినప్పుడు కొన్ని విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాను అని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు ఏంటంటే చిరంజీవితో చేయాల్సిన సినిమాకి కృష్ణ తో చేసిన ఒక సినిమా కి మధ్య డేట్స్ క్లాష్ అవ్వడం అనేది జరిగింది అయితే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ట్రావెల్ చేయడానికి అప్పట్లో ఇంత ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వలన ఆవిడకి డేట్స్ అనేవి ఇబ్బంది పెడుతూ ఉండేవి దానివల్ల ఆమె ఒక సినిమా ఒప్పుకున్న తర్వాత రెండు రోజుల గ్యాప్ తీసుకొని ఇంకొకటి ఒప్పుకోవాలి అని నిశ్చయించుకొని ఆ తర్వాత నుంచి అలా చేశారు అని కూడా చెప్పారు.

Conflicts Between Annapurnamma And Devadas Kanakala, Annapurnamma, Devdas Kanaka

ఈ మధ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమాలో నానమ్మ పాత్ర పోషించి మంచి కామెడీ పండించారు.ప్రస్తుతం ఆవిడ తెలుగు సినిమాలో చేస్తూ బుల్లితెరపై ఈవెంట్స్ లో కూడా పాల్గొంటూ తన లైఫ్ ని బిజీగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయితే ఒకప్పుడుస్టార్ హీరోలందరి సినిమాల్లో అమ్మ పాత్రలు పోషించి అందరి హీరోల చేత అమ్మ అని పిలిపించుకున్న అన్నపూర్ణమ్మ గారు ప్రస్తుతం సినిమాల్లో మంచి క్యారెక్టర్లు పోషిస్తూ బిజీగా గడుపుతున్నారు ఆవిడ చనిపోయేవరకు కూడా సినిమాల్లో యాక్టివ్ గా పాల్గొంటూ ఉండాలనేదే ఆవిడ కోరిక అని చాలా సందర్భాల్లో ఆవిడ తెలియజేశారు.

ఆ సీన్ కోసం చరణ్ మూవీ గ్లింప్స్ 1000 సార్లు చూస్తారట.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు