ఉదయ్ కిరణ్‌లో ఎవరికీ తెలియని ఆ టాలెంట్ బయట పెట్టిన కమెడియన్ సునీల్

ఉదయ్ కిరణ్ ( Uday Kiran )చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలతో చిన్నతనంలో నేను స్టార్ హీరో అయిపోయాడు.

ఈ మూవీలు అప్పట్లో బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి.

ఎలాంటి సపోర్ట్ లేకుండా ఆ మూవీ ఇండస్ట్రీ లోకి వచ్చి యుక్త వయసులోనే అతను ఈ స్థాయికి ఎదగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.అతనికి "హ్యాట్రిక్ హీరో"( Hatrick Hero ) అనే బిరుదు కూడా వచ్చింది.రొమాంటిక్ సినిమాలు తీస్తూ 2000ల ప్రారంభంలో లవర్ బాయ్ ఇమేజ్‌ని కూడా సంపాదించాడు.33 ఏళ్ల వయసులోనే 2014లో ఈ హీరో ఆత్మహత్య చేసుకున్నాడు.చనిపోయి పదేళ్లు దాటుతున్న సరే ఈ హీరోని తలుచుకొని ఈ హీరో గురించి మాట్లాడని సినిమా సెలబ్రిటీ ఉండరు అంటే అతిశయోక్తి కాదు.

ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి కావడమే అందుకు కారణం. కమెడియన్ సునీల్( Comedian sunil ) ఉదయ్ కిరణ్‌తో కలిసి చాలాసార్లు స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

ఆయన ఉదయ్ కిరణ్ గురించి ఒక ఆసక్తికర విషయం తెలిపారు.

Advertisement

కమెడియన్ సునీల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ఉదయ్ కిరణ్, నేను కలిసి చేసిన సినిమాలు చాలా పెద్ద హిట్స్ అయ్యాయి.వాటిలోని పాత్రల ద్వారానే నాకు మంచి పేరు వచ్చింది.ముఖ్యంగా "మనసంతా నువ్వే" సినిమాలో ఉదయ్ కిరణ్ ఫ్రెండ్‌గా నటించిన తర్వాత మంచి గుర్తింపు దక్కింది.

ఓ సినిమా షూటింగ్ తీస్తున్న సమయంలో అతనిలోని ఒక గొప్ప టాలెంట్ బయటపడింది.అదేంటంటే ఉదయ్ కిరణ్ చాలా గ్రేట్ రన్నర్.( Great runner ) అతను చాలా వేగంగా ఉరకడం చూసి నేను షాక్ అయిపోయా.

డైరెక్టర్ తేజ "నువ్వు నేను" సినిమా షూటింగ్ సమయంలో 100 మీటర్ పరుగు పందం పెట్టారు.అందులో పోలీస్ అకాడమీలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన రియల్ రన్నర్స్‌ను తీసుకున్నారు.

ఈ సన్నివేశం సినిమాలో భాగమేమైనా రియల్ గానే ఈ పోటీ జరిగింది అందులో వారందరినీ ఉదయ్‌ కిరణ్ ఓడించాడు.అది చూసినా తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయా" అని తెలిపారు.

రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?
నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?

అయితే ఇంత ఫాస్ట్‌గా ఎలా ఉరికావు? అని అడిగితే "నేను చిన్నతనం నుంచి సిటీ బస్సుల వెనుక పరిగెత్తే వాడిని" అని చెప్పినట్లు సునీల్ పేర్కొన్నారు.సునీల్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Advertisement

తాజా వార్తలు