సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరు పీఆర్వోల నియామకం..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి( Revanth Reddy ) కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

గత ఏడాది డిసెంబర్ 7వ తారీకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలను రద్దు చేయడం జరిగింది.కొంతమంది ప్రభుత్వ ఉన్నతాధికారుల నియామకాలను రద్దు చేయడం జరిగింది.

ఇదే సమయంలో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ పదవులను కూడా రద్దు చేశారు.తన కాన్వాయ్ వల్ల ప్రజలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులకు అనేక సూచనలు చేశారు.

అవసరమైతే కాన్వాయ్ లో కొన్ని వాహనాలు తగ్గించాలని కూడా కోరారు.ప్రగతి భవన్( Pragathi Bhavan ) ని ప్రజా భవన్ గా కూడా మార్చారు.

Advertisement

ఈ క్రమంలో "ప్రజావాణి"( Prajavani ) కార్యక్రమాలను నిర్వహించారు.ఇదిలా ఉంటే తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఇద్దరూ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బొల్గం శ్రీనివాస్, మామిడాల శ్రీధర్ ను పీఆర్వోలుగా నియమించడం జరిగింది.ఒకపక్క పాలన పరంగా ప్రక్షాళన.

మరోపక్క ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో.

అద్భుతమైన పాలన అందించే దిశగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మెగాస్టార్ కు ఆ పదవి దక్కబోతోందా ? 
Advertisement

తాజా వార్తలు