సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం..తెలంగాణలో ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్ లు..!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల విషయంలో గత కొద్ది నెలల నుండి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే దాదాపు 80 వేలకు పైగా పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ లు ఆయా శాఖల ద్వారా విడుదల చేయడం జరిగింది.

పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రతి జిల్లాలో స్టడీ సెంటర్ లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 132 స్టడీ సర్కిల్ సెంటర్ లు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఇవి కేవలం పోటీ పరీక్షలకు మాత్రమే కాకుండా.యువతకు ఉద్యోగ ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా ఉండాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్ లో నాలుగు సివిల్ సర్వీస్ సెంటర్ లు నెలకొల్పాలని కేసీఆర్ పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ప్రతి జిల్లాలో ఒక్కో స్టడీ సర్కిల్ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

Advertisement
తండ్రి శవాన్ని పక్కన పెట్టుకొని అలాంటి పని చేసిన ప్రభాస్... మరీ ఇంత మంచోడివి ఏంటయ్యా!

తాజా వార్తలు