సీఎం జగన్ అహంకారి..: చంద్రబాబు

తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా ‘రా కదలి రా’ బహిరంగ సభకు చంద్రబాబు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

సీఎం జగన్ అహంకారన్న చంద్రబాబు జగన్ రాష్ట్రాన్ని రివర్స్ లో పాలిస్తున్నారని మండిపడ్డారు.సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి సూచనలను జగన్ వినలేదన్నారు.

సీనియర్ నేతలను ఏనాడూ సీఎం జగన్ పట్టించుకోలేదని పేర్కొన్నారు.జగన్ వెయ్యి తప్పులు చేశారన్న ఆయన జగన్ ప్రభుత్వాన్ని కౌంట్ డౌన్ ప్రారంభమైందని తెలిపారు.

ఈ నేపథ్యంలో తుగ్లక్ పాలనను తరిమేయాలన్నారు.పాలకుడు విధ్వంసకారుడైతే రాష్ట్రం ఏం అవుతుందని ప్రశ్నించారు.

Advertisement

రాష్ట్రంలో ఏ ఒక్కరూ బాగుపడలేదన్న ఆయన ఉద్యోగులను సైతం ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు