చౌటుప్పల్ భారీగా గంజాయి పట్టివేత: డీసీపీ రాజేష్ చంద్ర...!

యాదాద్రి భువనగిరి జిల్లా: రామన్నపేట మండలం తొర్రర్ రోడ్ లో బోలోరో వాహనంలో తరలిస్తున్న 232 కేజీల బరువున్న 114 గంజాయి పొట్లాలను, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేశామని,మరో ఇద్దరు పరారీలో ఉన్నారని భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర తెలిపారు.

శనివారం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆయన వివరాలను వెల్లడించారు.

మహారాష్ట్రకు చెందిన ముగ్గురు, ఆంధ్ర,ఒడిశాకి చెందిన మరో ఇద్దరు కలిసి ముఠాగా ఏర్పడి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు గుర్తించామని, మహారాష్ట్రకు చెందిన ముగ్గరిని అదుపులోకి తీసుకోగా, ఆంధ్రా,ఒడిశాకు ఇద్దరు పరారీలో ఉన్నారని,వారి కోసం గాలిస్తున్నామని త్వరలోనే అరెస్ట్ చేస్తామని అన్నారు.సీజ్ చేసిన గంజాయి విలువ సుమారు రూ.42 లక్షలు ఉంటుందని తెలిపారు.నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న బోలోరో వాహనాన్ని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.

ఈ ఆపరేషన్ లో పాల్గొన్న చౌటుప్పల్ ఏసిపి ఉదయ్ కుమార్ రెడ్డి,రామన్నపేట సిఐ సిహెచ్.మోతీరాం, అడ్డగుడూరు ఎస్సై ఉదయ్ కిరణ్,రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్ర సింగ్ సోహన్,వారి సిబ్బందిని డిసిపి అభినందించారు.

కొండాపూర్ లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం
Advertisement

Latest Yadadri Bhuvanagiri News