Actress Anuradha: అధిక శృంగార రసంతో చిరంజీవితోపాటు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న నర్తకి అనురాధ…

చిరంజీవి, సుహాసిని, రావుగోపాలరావు, అన్నపూర్ణ ప్రధాన పాత్రలు పోషించిన మగమహారాజు సినిమా( Maga Maharaju Movie ) తాజాగా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది.1983 జులై 15న విడుదలైన ఈ సినిమాలో పాటలు ఉర్రూతలూగించాయి.

ముఖ్యంగా "మా అమ్మ చింతామణి.

నా పేరు సౌదామణి" అంటూ సాగే ఐటమ్ సాంగ్ సూపర్ హిట్ అయింది.ఈ పాటలో అనురాధ అలియాస్ సులోచన రాణి నూతన ప్రసాద్ తో రొమాన్స్ చేస్తూ కనిపిస్తుంది.

అధిక శృంగార రాసాన్ని పండిస్తూ ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసింది.ఇప్పటికీ ఈ పాట ప్రేక్షకులలో హీట్ పుట్టిస్తుందంటే ఆమెలో ఎంత మాయ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈ సాంగ్‌లో అనురాధ( Anuradha ) హాట్ డ్యాన్స్ స్టెప్పులతో కైపెక్కిస్తుంది కూడా.

Advertisement

అంతలా శృంగార రాసాన్ని పండించింది కనుక ఈ ముద్దుగుమ్మకు ఈ సినిమాతోనే సెక్సీస్ట్ ఐటెమ్‌ డ్యాన్సర్‌గా పేరొచ్చింది.అంతకు ముందు గంధర్వ కన్య( Gandharva Kanya ) వంటి సినిమాల్లో శృంగారభరిత పాత్రలు చేసింది కానీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.ఈ సినిమానే ఆమెకు మంచి లైఫ్ ఇచ్చింది.

ఈ పాట అప్పట్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది.అనురాధ ఈ మూవీ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.

తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, హిందీ, ఒరియా-భాషా చిత్రాలలో ఎన్నో అవకాశాలను దక్కించుకొని బిజియస్ట్ యాక్ట్రెస్‌గా భారతీయ చలనచిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపింది.

చిరంజీవికి ( Chiranjeevi ) కూడా ఈ మూవీ మంచి పేరు తెచ్చి పెట్టింది.ఇందులో మెగాస్టార్ ఎనిమిది రోజులు పాటు సైకిల్ నాన్ స్టాప్ గా తొక్కి లాటరీ విన్ అవుతాడు.ఆ సీన్ సినిమా మొత్తానికే హైలైట్ అవుతుంది.1983లో డైరెక్టర్ విజయ్‌ బాపినీడు తెరకెక్కించిన మగమహారాజు సినిమా చిరంజీవికి బ్లాక్‌బస్టర్‌ను అందించింది.తర్వాత చిరంజీవితో విజయ్ బాపినీడు కలిసి మహానగరంలో మాయగాడు, హీరో, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్‌బాస్ వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించాడు.

నాకు అవార్డు రాకుండా రాజకీయం చేశారు.. బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు!
అఖండ 2 పై ఆది పినిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు... ఒక్క మాటతో అంచనాలు పెంచారుగా!

ఆ సినిమాలతోనే చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగాడు.

Advertisement

తాజా వార్తలు