ధరల నియంత్రణపై చంద్రబాబు కీలక నిర్ణయం 

ఏపీలో కూరగాయలతో సహా , నిత్యవసర సరుకులు ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో,  సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న దృష్ట్యా, టిడిపి అధినేత , ఏపీ సీఎం చంద్రబాబు ( AP CM Chandrababu )ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

  ఈ మేరకు ధరల నియంత్రణ , పరిరక్షణపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఆయన ఏర్పాటు చేశారు.

  క్యాబినెట్ సబ్ కమిటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్న నాయుడు, సత్య కుమార్ ( Payyavula Keshav, Achchenna Naidu, Satya Kumar )లు ఉన్నారు.ధరల నియంత్రణపై సిఫార్సులు ఇవ్వాలని ఉత్తర్వ్యులు జారీ చేశారు.

  పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియల్ కార్యదర్శి ఈ కమిటీకి కన్వీనర్ గా ఉంటారని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది .

Chandrababus Key Decision On Price Control , Tdp, Janasena, Bjp, Telugu Desam P

నిత్యవసర వస్తువులు,  కూరగాయల ధరలు ఆకస్మికంగా పెరగడానికి కారణం ఏమిటి అనే దాని పైన అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  నిత్యవసరాలు , కూరగాయల ధరలు( essentials and vegetables ) తగ్గింపునకు చేపట్టాల్సిన చర్యల పైన సిఫార్సు చేయాలని ప్రభుత్వం ఉత్తర జారీ చేసింది.  ఉత్పత్తి,  సప్లై డిమాండ్ ధరలకు సంబంధించిన అంశాలు,  పంటల తీరు, ఎగుమతులు, దిగుమతులపై కూడా అధ్యయనం చేయాల్సిందిగా ఆదేశించింది.

Advertisement
Chandrababu's Key Decision On Price Control , TDP, Janasena, BJP, Telugu Desam P

  వినియోగదారులకు అందుబాటు ధరల్లో నిత్యవసరాలు,  కూరగాయలు లభించే విధంగా  తీసుకోవలసిన అన్ని రకాల చర్యల పైన నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Chandrababus Key Decision On Price Control , Tdp, Janasena, Bjp, Telugu Desam P

సామాన్య ప్రజలనుంచి ధరల పెరుగుదలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న నేపథ్యంలో,  అది పరోక్షంగా కూటమి ప్రభుత్వం వ్యతిరేకత పెరగడానికి కారణం అవుతోందని,  ముందు ముందు ఈ ధరల వ్యవహారం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారకుండా , ధరల నియంత్రణకు ఏం చేయాలనే దానిపైన చంద్రబాబు ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు .త్వరలోనే దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసేందుకు  ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Advertisement

తాజా వార్తలు