ఆరు నెలల తరువాత బాబు-కెసీఆర్ కలయిక

దాదాపు ఆరు నెలల తరువాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , తెలంగాణా ముఖ్యమంత్రి కెసీఆర్ ఆదివారం అంటే ఈ నెల 18 న కలుసుకోబోతున్నారు.

ఇది ఆహ్వానం కోసం జరుగుతున్న కలయిక.

ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించడానికి కెసీఆర్ ఇంటికి చంద్రబాబు వస్తున్నారు.ముందుగా ఏపీ సీఎమ్ కార్యాలయ అధికారులు వచ్చి కెసీఆర్ అప్పాయింట్మెంట్ తీసుకున్నారు.

బాబు కేవలం ఆహ్వాన పత్రిక ఇచ్చి వెళ్ళిపోకుండా కొద్దిసేపు కేసీఆర్తో సమావేశమై మంచి చెడూ మాట్లాడుకుంటారు అని సమాచారం.చాలా కాలం నుంచి ఉప్పు నిప్పుగా ఉంటున్న ఇద్దరు చంద్రుళ్ళు కొద్దిసేపైనా మనసు విప్పి మాట్లాడుకుంటే వాతావరణం చల్లబడుతుంది.

నోటుకు ఓటు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఇద్దరి మధ్య దూరం పెంచాయి.కొంతకాలంగా ఈ రెండు వివాదాలకు ఇద్దరు ముఖ్యమంత్రులు దూరంగా ఉన్నారు.

Advertisement

ఇతర విషయాల మీద కూడా వాదులాడుకోవడం లేదు.ఆదివారం చంద్రబాబు రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ను కూడా కలుసుకొని ఆహ్వాన పత్రిక అందచేస్తారు.

బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ అధ్యయనం .. నేడు ఆ రాష్ట్రానికి బృందం 
Advertisement

తాజా వార్తలు