ఓట్ల కోసం రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటు..: సజ్జల

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓట్ల కోసం రాజకీయ చేయడం చంద్రబాబు నైజమని మండిపడ్డారు.

ప్రజల కోసం రాజకీయ చేయడం సీఎం జగన్ కే చెల్లుతుందని సజ్జల తెలిపారు.చంద్రబాబు ఆయన సామాజిక వర్గం వారితోనే ఉంటారన్నారు.

తమ కేబినెట్ లో 70 శాతం మంది ఇతర కులాల వారు ఉన్నారని చెప్పారు.సీఎం జగన్ అందరి వాడని తెలిపారు.

ఓట్లు చీలకుండా చంద్రబాబు పవన్ కల్యాణ్ ను కలుపుకున్నారని పేర్కొన్నారు.అయితే ఏపీలో మళ్లీ జగనే సీఎం అవుతారని 70 శాతం సర్వేలు చెప్తున్నాయని తెలిపారు.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు