ప్రస్తుత కాలంలో ప్రయాణాలు చేయాలంటే కూడా చాలామంది భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.పెట్రోల్, డీజిల్ ధరలు( Fuel Prices ) అంతకంతకూ పెరుగుతుండటంతో చాలామంది తమ సంపాదనలో కొంత మొత్తాన్ని పెట్రోల్, డీజిల్ కోసం ఖర్చు చేస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు( Electric Vehicles ) అందుబాటులోకి వచ్చినా కొన్ని చిన్నచిన్న సమస్యల వల్ల ఈ వాహనాలను కొనుగోలు చేయడానికి, ఈ వాహనాలలో ప్రయాణించడానికి చాలామంది ఆసక్తి చూపించడం లేదు.
అయితే ఒక మెకానిక్( Mechanic ) మాత్రం బ్యాటరీతో పని చేసే మోపెడ్ ను( Battery Moped ) తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈ మెకానిక్ సక్సెస్ స్టోరీ గురించి తెలిస్తే మాత్రం గ్రేట్ అని అనకుండా ఉండలేము.కేవలం 3 గంటలు ఛార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్లు ప్రయాణించేలా బ్యాటరీతో పని చేసే మోపెడ్ ను ఈ వ్యక్తి రూపొందించడం గమనార్హం.
పేద కుటుంబానికి చెందిన ఈ మెకానిక్ పేరు వెంకటేశ్వరరావు.
కేవలం పదో తరగతి వరకు మాత్రమే చదివినా కృష్ణా జిల్లాకు చెందిన వెంకటేశ్వరరావు( Venkateswara Rao ) బ్యాటరీతో పని చేసే మోపెడ్ ను( Moped ) తయారు చేశారు.వెంకటేశ్వరరావుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.మెకానిక్ వర్క్ అంటే ఇతనికి ఇష్టం కాగా 25 ఏళ్ల అనుభవం ఉన్న వెంకటేశ్వరరావు బ్యాటరీతో మోపెడ్ పని చేసేలా చేసి ఆ వాహనంపై ప్రయాణం చేస్తూ సత్తా చాటుతున్నారు.
రోజుకు 50 రూపాయలు పెట్రోల్ కోసం ఖర్చు అవుతుండటంతో వెంకటేశ్వరరావు ఈ బ్యాటరీ వాహనాన్ని తయారు చేశారు.3 గంటల ఛార్జింగ్ కు కేవలం 10 రూపాయలు ఖర్చు అవుతుందని సమాచారం.సొంతంగా ఒక బండి తయారు చేయాలనే ఆలోచనతో కష్టపడి కెరీర్ పరంగా అనుకున్న సక్సెస్ ను సొంతం చేసుకున్నానని ఆయన వెల్లడించారు.వెంకటేశ్వరరావు సక్సెస్ స్టోరీ విషయంలో నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.