వేములవాడ లో పశువుల పేడతో బయోగ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్

ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మొట్ట మొదటి ఆవు పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్ ఎస్.ఆర్.

ఆర్.డి నిధులు రూ.31 లక్షల 60 వేల తో నిర్మాణం తిప్పపూర్ లోని శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయ( Sri Raja Rajeshwara Swamy temple ) అనుబంధ గోశాల అవరణలో ఏర్పాటు మిషన్ మోడ్ లో పనులు జూన్ 2 నాటికి ప్లాంట్ పూర్తి చర్యలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ( Vemulawada ) పట్టణం తిప్పాపూర్ లో వేములవాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఆవు, కోడెల పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది.మంత్రి కే తారకరామారావు మార్గదర్శనం మేరకు శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయం నిధులు రూ.31 లక్షల 60 వేల తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే జూన్ 2 లోగా పూర్తి చేయనున్నారు.ఆలయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మొట్ట మొదటి ఆవు పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్ నిర్మాణ పనులు వారం రోజుల క్రితం ప్రారంభం అయ్యాయి.ఈ ప్లాంట్‌లో బయోగ్యాస్‌ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రోజుకు 2.5 టన్నుల పశువుల పేడను వినియోగించనున్నారు.ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ను గోశాలను ఆనుకుని ఉన్న వేములవాడ ఏరియా ఆసుపత్రి తో పాటు ఆలయ ఎలక్ట్రిసిటీ అవసరాలను తీర్చనుంది.

పశువుల పేడ ఆధారిత బయోగ్యాస్ ఆధారిత ఎలక్ట్రికల్ ప్లాంట్ ఇన్స్టలేషన్ పనులను తమిళనాడు ( Tamil Nadu )కు చెందిన సుందరం ఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్ చూస్తుండగా పర్యవేక్షణ బాధ్యతలను వేములవాడ మున్సిపాలిటీ చూస్తుంది.ప్లాంట్ ఆపరేషన్, నిర్వహణ బాధ్యతలను కూడా ఒక సంవత్సరం ఒప్పంద ప్రాతిపదికన సుందరం ఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్ అప్పగించేందుకు ఈ సంవత్సర కాలంలోనే ప్లాంట్ ఆపరేషన్, నిర్వహణ పై సుందరం ఫాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బంది తో ఆలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు.

ప్లాంట్ ఇన్స్టాలేషన్ రోజువారిగా పనుల పురోగతిని రోజువారీగా జిల్లా కలెక్టర్ పరిశీలిస్తున్నారు.ఈ ఎకో ఫ్రెండ్లీ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే పక్కనే ఉన్న ఏరియా హాస్పిటల్ ఎలక్ట్రిసిటీ బిల్లులు గణనీయంగా తగ్గడమే కాకుండా ఆలయ అవసరాలకు కూడా గ్రీన్ ఎనర్జీ అందుబాటులోకి వస్తుంది.

Advertisement
పత్తి కొనుగోలుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

Latest Rajanna Sircilla News