కెనడా : ఆలయ చీఫ్ కొడుకు ఇంటిపై కాల్పులు .. ఎవరి పని , దుండగుల కారును గుర్తించిన పోలీసులు

గత నెల 27న బ్రిటీష్ కొలంబియాలోని సర్రే పట్టణంలోని( Surrey ) స్థానిక ఆలయ అధ్యక్షుడి కుమారుడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపిన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనతో కెనడాలోని హిందూ కమ్యూనిటీ( Hindu Community ) ఉలిక్కిపడింది.

ఈ కాల్పులకు సంబంధించి ఓ వాహనాన్ని పోలీసులు గుర్తించారు.శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆర్‌సీఎంపీ) సర్రే డిడాచ్‌మెంట్.జనరల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ దర్యాప్తును ముమ్మరం చేసింది.2017, 2019 మోడల్ బ్లూ కలర్ 4 డోర్ హ్యాచ్ బ్యాక్( Blue 4-Door Hatchback ) కారుగా దీనిని పోలీసులు భావిస్తున్నారు.ఈ వాహనం ఫోటోలను పోలీసులు విడుదల చేశారు.

వాహనాన్ని చూసిన వారు లేదా దాని గురించి సమాచారం వున్న వారు తమను సంప్రదించాల్సిందిగా సర్రే ఆర్‌సీఎంపీ ప్రతినిధి సర్బ్‌జిత్ సంఘా( Sarbjit Sangha ) కోరారు.

Canada Police Find Lead Linked To Shooting At House Of Temple Heads Son Details,

డిసెంబర్ 24 తెల్లవారుజామున సర్రేలోని లక్ష్మీనారాయణ్ మందిర్( Lakshmi Narayan Mandir ) అధ్యక్షుడు సతీష్ కుమార్( Satish Kumar ) కుమారుడి నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు 12 రౌండ్ల కాల్పులు జరిపారు.ఈ ఘటనపై ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు స్పందించారు.ఈ సమస్యను పరిష్కరించేందుకు కుమార్ .శనివారం సర్రేలో కమ్యూనిటీ ఫోరమ్‌ సమావేశానికి పిలుపునిచ్చారు.ఈ ఫోరమ్‌లో బ్రిటీష్ కొలంబియా అటార్నీ జనరల్ నికి శర్మ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సర్రే మేయర్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ సభ్యులు సహా రాజకీయ నాయకులు పాల్గొంటారని సతీష్ వెల్లడించారు.

Advertisement
Canada Police Find Lead Linked To Shooting At House Of Temple Heads Son Details,

మరోవైపు.మెట్రో వాంకోవర్ ప్రాంతంలో దోపిడీ ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నాయి.వ్యాపారవేత్తలకు బెదిరింపు లేఖలు కూడా వస్తున్నాయి.

ముఖ్యంగా పంజాబ్‌తో సన్నిహిత సంబంధాలున్న ముఠాల నుంచి ఇవి వస్తున్నట్లుగా భావిస్తున్నారు.

Canada Police Find Lead Linked To Shooting At House Of Temple Heads Son Details,

అంతేకాదు.సతీష్ కుమార్ నేతృత్వంలోని ఆలయం ఖలిస్తాన్ మద్ధతుదారులకు( Khalistan Supporters ) తరుచుగా లక్ష్యంగా మారుతోంది.దేవాలయంపై రెండు సార్లు వీరు దాడులకు పాల్పడటంతో పాటు గోడలపై భారత వ్యతిరేక వ్యాఖ్యలు , పోస్టర్లు అంటించారు.

వాటిలో కెనడాలో( Canada ) విధులు నిర్వర్తిస్తున్న భారతీయ దౌత్యవేత్తలను బెదిరించారు.అయితే ఆ ఘర్షణలకు, ప్రస్తుత కాల్పుల ఘటనను లింక్ చేయడానికి ఆలయ పాలకమండలి అంగీకరించడం లేదు.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

గతేడాది నవంబర్ 26న వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ పిలుపు మేరకు కాన్సులర్ క్యాంప్‌ను ఆలయ అధికారులు నిర్వహించారు.దీనిని ఖలిస్తాన్ వేర్పాటువాదులు, ఎస్ఎఫ్‌జే సానుభూతిపరులు తీవ్రంగా ప్రతిఘటించారు.

Advertisement

తాజా వార్తలు