కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై న్యాయ విచారణ చేపడతామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.కేసీఆర్ ను కాపాడేందుకు సీబీఐ విచారణ చేయాలని బీజేపీ అంటోందని ఆరోపించారు.
తుమ్మడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం కోసం వచ్చే బడ్జెట్ లో ప్రతిపాదనలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు.లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత అంశంలో ఎందుకు నాన్చుతున్నారని ప్రశ్నించారు.
కవితపై అన్ని ఆధారాలు ఉన్నాయని బీజేపీ నేతలే చెప్తున్నారన్న ఆయన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.