పోటీలో గెలిచిన వారికి వింత బహుమతి.. !

సాధారణంగా ఏదైనా పోటీల్లో పాల్గొన్నప్పుడు బహుమతులు ఇవ్వడం సర్వసాధారణం.ఇంకా నేషనల్ పోటీలంటే బహుమతి ఇంకా ఏ రేంజ్ లో ఉండాలి.

అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం కాస్త డిఫెరెంట్ గా ఉంటుంది.అదేమిటంటే.

జాతీయ స్థాయి పోటీల్లో గెలిచిన వారికీ మెడల్ తో పాటు గేదెను బహుమతిగా ఇస్తున్నామని ప్రకటించారు.అవునండి.

మీరు విన్నది నిజమే.ఈ పోటీల్లో గెలిచినా ఉత్తమ క్రీడాకారిణికి ఒక గేదెను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నారట.

Advertisement

ప్రస్తుతం ఆగ్రాలో నేషనల్ ఉమెన్ రైజ్లింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి.ఈ పోటీలో పాల్గొనే ఉత్తమ క్రీడాకారిణికి బహుమతిగా ఒక గేదెను ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు మహావీర్ ప్రసాద్ ప్రకటించారు.ఈ పోటీలో గెలిచిన ఉత్తమ క్రీడాకారినికి మెడల్ తో పాటుగా 1.5 లక్షల విలువ చేసే గేదెను ఇంటికి తీసుకెళ్లవచ్చని తెలిపారు.అయితే ఇలా ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో అందుకు వారు ఒక కారణం కూడా చెప్పారు.

డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఈ పోటీలో గెలిచిన ఉత్తమ క్రీడాకారినికి ఒక గేదెను బహుమతిగా ఇవ్వాలనే ఆలోచన వచ్చిందని.ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారని ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ప్రసాద్ వెల్లడించారు.వారి ఉద్దేశం ప్రకారం.

బహుమతిగా అందించిన గేదె ద్వారా గెలిచిన విన్నర్ కు నిరంతరం ప్రోటీన్లు అందజేయాలనే ఉద్దేశంతో.అంటే గేదె ద్వారా లభించే పాలు తాగి మరింత బలంగా తయారవ్వాలని తమ ఉద్దేశమని చెబుతున్నారు.

అయితే ఈ బహుమతి విషయంలో ఇంకా తుది నిర్ణయం రావలసి ఉందని అందుకోసం ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశామని మహావీర్ ప్రసాద్ వెల్లడించారు.ఒక వేళ గేదెను బహుమతిగా ఇవ్వలేకపోతే రూ .1.5 లక్షల నగదును బహుమతిగా చెల్లిస్తామని తెలిపారు.

తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!
Advertisement

తాజా వార్తలు