బుచ్చిబాబు.. ఒక నూతిలో పడ్డ కప్ప పరిస్థితి

మెగా ఫ్యామిలీ నుండి వైష్ణవ్ తేజ్‌ ను హీరో గా పరిచయం చేసిన బుచ్చి బాబు సన ఇప్పుడు సెకండ్‌ సినిమా కోసం వెయిట్‌ చేస్తున్నాడు.

వైష్ణవ్‌ తేజ్ ను ఉప్పెన సినిమా తో హిట్‌ హీరోగా పరిచయం చేసిన దర్శకుడు బుచ్చి బాబుకు మంచి పేరు వచ్చింది.

ఆ పేరుతోనే పలువురు యంగ్‌ స్టార్‌ హీరోలు ఆయనతో సినిమాను చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.కాని ఇప్పుడు పరిస్థితి అస్సలు బాగా లేదు అంటున్నారు.

ఎన్టీఆర్‌ వెంటనే కథ కు ఓకే చెప్పాడు.కాని ఇప్పటి వరకు ఆయన డేట్లు ఎప్పుడు ఇచ్చేది క్లారిటీ ఇవ్వలేదు.

ఆయన ఖాళీ అవ్వాలంటే కనీసం ఏడాదిన్నర కాలం పడుతుంది.మరో వైపు రామ్‌ చరణ్‌ కి కూడా కథ ను వినిపించినా కూడా ఆయన రెండేళ్ల వరకు బిజీ అన్నాడట.

Advertisement

కథ ఓకే అంటున్నారు కాని ఇప్పటి వరకు ఏ ఒక్క హీరో కూడా బుచ్చి బాబుకు డేట్లు ఇవ్వలేదు అనేది టాక్‌.హీరో లు కొందరు బుచ్చి బాబు తో చేసేందుకు వెంటనే డేట్లు ఇచ్చేందుకు ఓకే అంటున్నారు.

కాని ఇప్పటి వరకు బుచ్చి బాబు పెద్ద హీరో లతోనే తన రెండవ సినిమా ను చేయాలని ఎదురు చూస్తున్నాడు.అందుకే రెండేళ్లు అవుతున్నా కూడా కొత్త ప్రాజెక్ట్‌ ను మొదలు పెట్టలేదు.

బుచ్చి బాబు ప్రస్తుత పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది.బావిలో పడ్డ కప్ప మాదిరిగా ఉంది.

బావిలో అంతా సౌకర్యంగా ఉంది అనిపిస్తున్నా కూడా చుట్టు ఏం లేక పోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి.ఉప్పెన తో మంచి సక్సెస్‌ దక్కించుకున్నా కూడా బుచ్చి బాబుకు మాత్రం ఇంకా ఏ ఒక్క హీరో డేట్లు ఇవ్వక పోవడం వల్ల మొత్తం ప్రతిభ బూడిదలో పోసిన పన్నీరు అన్నట్లుగా నిరుపయోగంగా ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఎన్టీఆర్‌.రామ్‌ చరణ్ వంటి స్టార్స్ కోసం ఎదురు చూడకుండా.

Advertisement

వారి డేట్ల కోసం వెయిట్‌ చేయకుండా ఎవరికి వీలు ఉంటే వారికి సినిమా చేసి పెట్టడం వల్ల బుచ్చి బాబుకు మరిన్ని సక్సెస్‌ లు దక్కుతాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌.

తాజా వార్తలు