రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ పార్టీలో ఉన్నమో ఆ పార్టీ నేతలను.అధిష్టానాన్నిగౌరవించడం సహజం.
అలాకాదని పార్టీకి.హైకమాండ్ కి వ్యతిరేకంగా మాట్లాడితే మాత్రం.
చర్యలు తప్పకుండా తీసుకుంటాయి.ఇది ఏ పార్టీలోనైనా ఉంటుంది.
ఇక ప్రాంతీయ పార్టీల్లో ఎక్కువగా కనిపిస్తుంది.ఇక రాజకీయాల్లో రాణించాలంటే ఎవరికైనా ఒక పార్టీ అవసరం కచ్ఛితంగా ఉంటుంది.
ఆ పార్టీలో ఉంటూనే ప్రజలకు సేవ చేసుకుంటూ పార్టీకి.వ్యక్తిగతంగానూ మంచి పేరు తెచ్చుకుంటారు.
వ్యక్తులకు గుర్తింపు పార్టీల ద్వారానే సాధ్యమవుతుందనేది తెలిసిన విషయమే.అలా కాకుండా పార్టీని గౌరవించకుండా తమ వల్లే పార్టీ ఉందని.
తను లేకపోతే గత్యంతరం లేదనే దోరణిలో కొంతమంది ప్రవర్తిస్తుంటారు.
ఎంపీ తీరుపై విమర్శలు పార్టీకి ఉన్న బలంతో పదవులు సంపాదించి తమ సొంత బలంతో ఎదిగామని నేతలు ఎప్పుడైతే అనుకోవడం ప్రారంభిస్తారో.
అప్పటినుంచే వారిని ఆయా పార్టీలు దూరం పెట్టడం చేయాలి.లేదంటే ఎప్పటికైనా వారితో ప్రమాదే.ఏపీలో ప్రస్తుతం ఓ ఎంపీ తీరు ఇలాగే ఉంది.తాజాగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని తమ పార్టీ అధినేత చంద్రబాబు పట్ల వ్యవహరించిన తీరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఢిల్లీ పర్యటనకు వచ్చిన చంద్రబాబుకు స్వాగతం చెప్పడానికి ఎంపీలంతా విమానాశ్రయానికి వచ్చారు.బొకే ఇవ్వమని మరో ఎంపీ గల్లా జయదేవ్ సూచించగా దానికి నిరాకరించి పక్కనపడేసేంత పనిచేశారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయినా కూడా జరిగిన సంఘటనను చంద్రబాబు మౌనంగా చూస్తుండిపోయారు.బాబుకున్న సాఫ్ట్ కార్నర్‌తోపాటు ఎన్నిసార్లు తప్పులు చేస్తున్నా నేతలను బాబు ఎప్పుడూ సీరియస్ గా తీసుకోకపోవడమే ఇందుకు కారణం అంటున్నారు టీడీపీ నేతలు.కార్యకర్తలు.
ఇదే ప్రవర్తన మరో పార్టీలోనే మరో అధినేతకో జరిగితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌తోనో లేదంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఏ ఎంపీ కూడా ఇలా ప్రవర్తించే ఆలోచన కూడా చేయరు.
ఎందుకంటే చేస్తే ఏం అవుతుందో బాగా తెలుసు.ప్రధానమంత్రి నరేంద్రమోడీకి స్వాగతం పలికే సమయంలో ఏ ఎంపీనన్నా ఇలాగే చేయమనండి.
వారికి ఏ గతి పడుతుందో.అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ జరుగుతోంది.
ఒక పార్టీ అధినేతతో వ్యవహరించే తీరు ఇదేనా అంటూ టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.బాబు కాబట్టి ఊరుకుంటున్నారని.మరో అధినేత అయితే ఏం చేస్తాడో బాగా తెలిసొచ్చేదని అంటున్నారు.మీడియా ప్రతినిధులతో మాట్లాడే సమయంలో కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం సాగింది.అవి అవాస్తవమంటూ ఆయన ఖండించనూలేదు.పార్టీ అధినేత చూసీ చూడనట్లుగా ఊరుకోవడం అలుసుగా మారిపోతోందని.
ఈ తరహా ధోరణిని బాబు మానుకోకపోతే మరికొందరు కేశినేనిలు తయారవుతారని అంటున్నారు.ఇటువంటివారిపై కఠినంగా వ్యవహరించాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.
ఇలా ప్రవర్తించే వారితో టీడీపీకి ఒరిగేది కూడా ఏమీలేదని అంటున్నారు.