నేడే ఔరంగాబాద్ బీఆర్ఎస్ సభ ! అన్నీ భారీగానే...

ఒక్కో రాష్ట్రంపై పట్టు పెంచుకునే దిశగా తెలంగాణ అధికార పార్టీ బిఆర్ఎస్( BRS party ) ప్రయత్నాలు చేస్తుంది.

ముఖ్యంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మార్చిన తరువాత  మహారాష్ట్ర పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు .

బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తూనే , మహారాష్ట్రలో పట్టు పెంచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే రెండుసార్లు మహారాష్ట్రలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలు నిర్వహించారు.

  ఇక ఈ రోజు మహారాష్ట్రలోని ఔరంగాబాద్( Maharastra ) లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు.తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్ర లో బీఆర్ఎస్ బలపడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని సర్వే రిపోర్టులు అందడంతో,  దీనిపైన ఎక్కువగా కెసిఆర్ ఫోకస్ పెట్టారు .

Brs Maharashtra Meeting Today , Telangana, Kcr, Telangana Cm Kcr , Brs Maha

ఈరోజు ఏర్పాటు చేసిన ఔరంగాబాద్ సభ కు భారీగా జన సమీకరణ చేపట్టారు.ఎప్పటికప్పుడు సభ ఏర్పాటుకు సంబంధించి పార్టీ అధినేత కేసిఆర్ ( CM kcr )పర్యవేక్షణ చేస్తున్నారు.ఈ సభలోనే భారీగా చేరికలు ఉండేవిధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.

Advertisement
BRS Maharashtra Meeting Today , Telangana, Kcr, Telangana Cm Kcr , BRS Maha

  స్థానికంగా మంచి పేరున్న నేతలు,  మాజీ ఎమ్మెల్యేలు,  ఇతర ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తుండడంతో మరింత ఉత్సాహంగా ఈ చేరికలను ప్రోత్సహించే దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.

Brs Maharashtra Meeting Today , Telangana, Kcr, Telangana Cm Kcr , Brs Maha

ఈ సభను సక్సెస్ చేసేందుకు ఇప్పటికే తెలంగాణకు చెందిన మంత్రులు,  ఎమ్మెల్యేలకు కేసిఆర్ బాధ్యతలను అప్పగించారు.  గత కొద్ది రోజులుగా అక్కడే మకాం వేసి మరి సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.కనీసం రెండున్నర లక్షల మంది జనాలను సమీకరించే విధంగా టార్గెట్ పెట్టుకున్నారు .

Brs Maharashtra Meeting Today , Telangana, Kcr, Telangana Cm Kcr , Brs Maha

ఈ సభను సక్సెస్ చేయడం ద్వారా ఇతర రాష్ట్రాల చూపు బిఆర్ఎస్ వైపు పడేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.మహారాష్ట్రకు చెందిన రైతులు బీఆర్ఎస్ వైపు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడం,  తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ముఖ్యంగా రైతుబంధు వంటి పథకాలపై మహారాష్ట్రలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో,  తమ ప్రసంగాలలోనూ ఎక్కువగా రైతులను ప్రసన్నం చేసుకునే విధంగా కెసిఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు