బీఆర్ఎస్ టార్గెట్ ఆ పదే... ఉప ఎన్నికలపై ఆశలు

తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయనే ఆశతో ఉంది బీఆర్ఎస్ పార్టీ.

( BRS Party ) 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి,  కాంగ్రెస్ లోకి( Congress ) ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కచ్చితంగా వేటుపడుతుందని , ఇప్పటికే హైకోర్టు ఆ పదిమంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.

అందుకే ఉప ఎన్నికల ఫై  ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది.  పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న పది నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే విషయంపై దృష్టి సారించింది .ఈ మేరకు  ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలను , శ్రేణులను సమన్వయం చేసుకుని పార్టీని పటిష్టం చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటుంది.

Brs Focus On Bypolls In These Ten Constituencies Details, Brs,kcr, Telangana El

ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు( Bypolls ) వస్తాయని భావిస్తున్న బీఆర్ఎస్ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటుంది.10 నియోజకవర్గాల బీఆర్ఎస్ నేతలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) విడివిడిగా సమావేశం కానున్నారు.  మొదటగా ఈరోజు శేరిలిగంపల్లి తో ఆయన సమావేశాలు ప్రారంభించనున్నారు.

ఈ మేరకు ఆయా నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలు , కార్యకర్తలతో భేటీ అయి వారికి దిశా, నిర్దేశం చేయనున్నారు.అలాగే పార్టీ తరపున కార్యక్రమాలు,  ఉప ఎన్నికల సన్నద్ధత వంటి అంశాలపై వారికి వివరించి,  ఆ తరువాత మిగిలిన నియోజకవర్గాల ముఖ్య నేతలతోనూ కేటీఆర్ సమావేశం కానున్నారు. 

Brs Focus On Bypolls In These Ten Constituencies Details, Brs,kcr, Telangana El
Advertisement
Brs Focus On Bypolls In These Ten Constituencies Details, BRS,KCR, Telangana El

10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలతో పాటు,  స్థానిక సంస్థల ఎన్నికలకు వారిని సిద్ధం చేసేందుకు అవసరమైన ప్రణాళికను బీఆర్ఎస్ రచిస్తోంది.ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయంలో న్యాయపరంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.ఇప్పటికే హైకోర్టు( High Court ) కూడా శాసనసభ కార్యదర్శి కి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో,  హైకోర్టు ఆదేశాల తరువాత జరగబోయే పరిణామాలను బీఆర్ఎస్ అంచనా వేసుకుంటుంది.

అవసరమైతే ఈ విషయంలో సుప్రీంకోర్టు కు కూడా వెళ్లేందుకు సిద్ధం అవుతుంది.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని బీఆర్ఎస్ మొదటి  నుంచి చెబుతూనే వస్తుంది.

ఈ నేపథ్యంలోనే 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు కచ్చితంగా వస్తాయని అంచనా వేస్తోంది.దానిలో భాగంగానే పార్టీ నాయకులను దానికి సిద్ధం చేస్తుంది.

భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?
Advertisement

తాజా వార్తలు