ఎంపీ ఎన్నికలు బారాసా కు కత్తి మీద సామేనా?

ఇప్పటికే ఎదురు చూడని ఓటమితో నిరాశలో కూరుకుపోయిన భారతీయ రాష్ట్ర సమితి( BR Party )కి పులి మీద పుట్రలా పార్టీ అధినేత కేసిఆర్ మంచాన పడటం, అది కూడా దీర్ఘకాలం ఇబ్బంది పడేలా తుంటి ఎముకలు విరిగిన ప్రమాదం కావడంతో ఇప్పుడు మునుపటిలా కేసీఆర్ రాజకీయాల్లో యాక్టివ్ గా పని చేస్తారా లేదా అన్నది ప్రశ్నగా మారింది.

ఎందుకంటే తుంటి ఎముక విరిగిన తర్వాత ఆరోగ్యం చాలా వేగంగా క్షీణిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ కోలుకున్నా పూర్తిస్థాయిలో నడవటం కుదరదని ఇంతకుముందులా యాక్టివ్గా పనిచేయలేరని చాలామంది వైద్య నిపుణులు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

దాంతో రానున్న కీలకమైన పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని నడిపించే నాయకుడు లేకపోవడం బారతీయ రాష్ట్ర సమితి కి అతిపెద్ద సమస్యగా మారింది. కేటీఆర్ హరీష్ రావులు కీలకమైన నాయకులే అయినా ఎనక కొండంత అండలా కేసీఆర్( KCR ) నిలబడితేనే వీరు ధైర్యంగా కార్యక్షేత్రంలో పనిచేయగలుగుతారు.అందులోనూ పార్లమెంట్ ఎన్నికలు అంటే జాతీయస్థాయి నాయకుల ప్రాతిపదికగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ స్థాయికి సమతూకంగా ఉండాలంటే కెసిఆర్ స్థాయి నాయకుడు నిలబడాల్సిందే, పైగా ఇప్పటికే మూడు రాష్ట్రాల ఎన్నికలను గెలుచుకోవడం తోపాటు తెలంగాణలో కూడా గణనీయమైన స్థాయిలో ఓట్ల శాతం తెచ్చుకోవడం తో రెట్టించిన ఉత్సాహంతో బిజెపి పని చేసే అవకాశం ఉంది.

మరోపక్క కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్( Congress ) కూడా నూతనఉత్తేజంతో అత్యధిక సంఖ్యలో ఎంపీలను గెలుచుకోవాలని వ్యూహాలు పన్ను తుంది అనడం లో ఏమాత్రం సందేహం లేదు పైగా రేవంత్ దూకుడు చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల వరకు రోజుకొక కొత్త పథకాన్ని అమలు చేసి తెలంగాణ ప్రజలను ఆకట్టుకోవడానికి చూస్తాడు అనడం లో ఏ మాత్రం సందేహం లేదు.దాంతో నాయకుడు లేని సేన ను నడిపించడం బీఆరఎస్ కు అతిపెద్ద సవాల్ గా మారబోతుందని తెలుస్తుంది .కేసీఆర్ కోలుకొని సాధారణ జీవితంలోకి రావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలలు పడుతుందని అంచనాల వినిపిస్తున్న దరిమిలా ఆయన కోలుకునే సమయానికి ఎన్నికలు ముంగిట్లోకి వచ్చి ఉంటాయి కాబట్టి ఇంత తక్కువ సమయంలో ఓటమి బాధ నుంచి ఎన్నికలకు సిద్ధం కావడం అన్నది బీఆరఎస్ కు కష్టసాధ్యమే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇలా ఎటుచూస్తున్న బారతీయ రాష్ట్ర అత్యంత క్లిష్టమైన పరిస్తితి ని ఎదుర్కుంటునది అని చెప్పవచ్చు.

Advertisement
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఏప్రిల్ 25, ఆదివారం, 2021

తాజా వార్తలు