సీఎం గారు నా రాజధాని ఎక్కడ?

కేంద్ర హోం శాఖ విడుదల చేసిన కొత్త భారత దేశ చిత్ర పటం ప్రస్తుతం ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఏపీ రాజధాని అమరావతి అంటూ అంతా అనుకుంటున్నారు.

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అమరావతి రాజధాని అంటూ ప్రకటించాడు.కాని అప్పుడు గెజిట్‌ తీసుకు రావడంలో ఆయన విఫలం అయ్యాడు.

ఇప్పుడు జగన్‌ వచ్చిన తర్వాత మళ్లీ రాజకీయం వేడి ఎక్కి రాజధాని విషయమై పలు రకాల చర్చలు జరుగుతున్నాయి.ఈ సమయంలో భారత దేశ చిత్ర పటంలో అమరావతి లేకపోవడంతో తెలుగు దేశం పార్టీ నాయకులు చాలా సీరియస్‌ అవుతున్నారు.

ఈ విషయమై ఎంపీ రామ్మోహన్‌ నాయుడు చాలా తీవ్రంగా స్పందించాడు.వేర్‌ ఈజ్‌ మై క్యాపిటల్‌ అంటూ ఒక హ్యాట్‌ ట్యాగ్‌ను ఆయన క్రియేట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

Advertisement

ఆయన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.సీఎం జగన్‌ వెంటనే ఈ విషయమై స్పందించాలంటూ ఆయన డిమాండ్‌ చేశాడు.

రాష్ట్ర ప్రజలు రాజధాని విషయంలో చాలా ఆందోళనగా ఉన్నారు.అసలు ఏం జరుగుతుందో అనేది వారి ఆందోళన.

అందుకే మీరు వెంటనే స్పందించాలంటూ ఎంపీ ఇలా ట్వీట్‌ చేశాడు.వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత దిగజారిందో ఈ చిత్రపటమే చెప్తుంది.

అసలు మనకి రాజధాని ఉందా లేక అమరావతిని పూర్తిగా బ్రష్టు పట్టిస్తున్నారా? ఇప్పుడు చిత్రపటంలోనే కనపడలేదు, రేపు అసలు ఉంటుందో లేదో అన్న అనిశ్చితి నెలకొంది.ఈ విషయం మీద @ysjagan మౌనం వీడి సమాధానం ఇవ్వాలి#whereismycapital.

రాజకీయాల కంటే సినిమాలే బెటర్.. కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు