వామ్మో ...ఆ హీరో అనారోగ్యం ఖరీదు దాదాపుగా 600 కోట్లు..

బాలీవుడ్లో ప్రముఖ సీనియర్ హీరో సంజయ్ దత్ కి  ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి కొత్తగా సినీ ప్రేక్షకులకు చెప్పనవసరం లేదు.

పాత్ర ఏదైనా సరే తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంజయ్ దత్ స్పెషాలిటీ.

అయితే ప్రస్తుతం సంజయ్ దత్ పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసిందే.  కాగా  సంజయ్ దత్ ప్రస్తుతం అనారోగ్యం కారణంగా ఆసుపత్రి లో చేరడంతో దాదాపుగా పలు భారీ బడ్జెట్ చిత్రాల చిత్రీకరణ పనులు ఆగిపోయాయి.

  దీంతో కొంత మేర ఆ చిత్ర యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేగాక ప్రస్తుతం సంజయ్ దత్ తమిళం, హిందీ, కన్నడ, తెలుగు తదితర భాషలలో దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్న చిత్రాలలో నటిస్తున్నాడు.

 దీనికి తోడు ఇటీవలే ఈచిత్రాలకి సంబంధించిన పలు అధికారిక ప్రకటనలు కూడా వెలువడటం, పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ పనులు కూడా పూర్తవడంతో కొంతమేర చిత్ర యూనిట్ సభ్యులు సందిగ్ధంలో పడ్డారు.దీంతో సంజయ్ దత్ తొందరగా కోలుకోవాలని అభిమానులతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు కూడా బాగానే ఆ దేవున్ని ప్రార్థిస్తున్నారు.

Advertisement

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సంజయ్ దత్ కేజిఎఫ్ 2, పృథ్విరాజ్, సడక్ 2, షంషేర్, ది ప్రైడ్ ఆఫ్ ఇండియా, తదితర చిత్రాలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తున్నాడు.అయితే ఇటీవలే సంజయ్ దత్ తన భార్య మాన్యత దత్ ఆయన ఆరోగ్యం విషయం గురించి స్పందించి ప్రస్తుతం తన భర్త సంజయ్ దత్ కోలుకుంటున్నాడని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు