తెలంగాణలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు రంగం సిద్ధం చేసింది.

ఈ క్రమంలోనే బీజేపీ బూత్ స్థాయి సమ్మేళనం చేపట్టనుండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా ప్రసగించనున్నారని సమాచారం.కాగా ఈ బూత్ స్థాయి సమ్మేళనంలో బండి సంజయ్, సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ లు పాల్గొనున్నారు.

ఇందుకోసం 119 నియోజకవర్గాల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.అనంతరం బీజేపీ సరళ్ యాప్ ను విడుదల చేయనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా సరళ్ యాప్ ను జేపీ నడ్డా ప్రారంభించనున్నారు.అదేవిధంగా మిషన్ 90లో భాగంగా సంస్థాగత నిర్మాణంపై బీజేపీ దృష్టి సారించిన విషయం తెలిసిందే.

Advertisement

సరళ్ యాప్ ద్వారా ఇప్పటికే గుజరాత్, బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ మంచి ఫలితాలను సాధించింది.

ఆ విషయంలో ఫహాధ్ ఫాజిల్,రాజ్ కుమార్ రావ్ ఫాలో అవుతున్న రాగ్ మయూర్?
Advertisement

తాజా వార్తలు