రిటైర్మెంట్ గురించి చెప్పకనే చెప్పిన బీహార్ సీఎం

ఒకపక్క బీహార్ లో ఎన్నికల హడావుడి నెలకొన్న ఈ సమయంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఒక కీలక ప్రకటన చేశారు.

బీహార్ లో ఇప్పటికే రెండు దశల పోలింగ్ ముగియగా ఆఖరిగా మూడో దశ పోలింగ్ త్వరలో జరగనుంది.

ఈ నేపథ్యంలో పార్టీ లు తమ తమ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారం సందర్భంగా గురువారం ఆయన కీలక ప్రకటన చేశారు.

Bihar CM Nitish Kumar Announces Retirement After 2020 Assembly Elections Bihar,

బిహార్‌ 2020 అసెంబ్లీ ఎన్నికలే తన జీవితంలో చివరి ఎన్నికలని అంటూ తన రాజకీయ జీవితానికి రిటైర్మెంట్‌ విషయాన్నీ చెప్పకనే ప్రజల ముందు బయటపెట్టారు.బీహార్ లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా పూర్ణియా జిల్లాలో గురువారం బహిరంగ సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పాల్గొన్న నితీష్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.బిహార్‌ ఎన్నికల ప్రచారానికి ఈరోజు ఆఖరి రోజు.

Advertisement

నా రాజకీయం జీవితానికి కూడా ఇదే ఆఖరి రోజు.ఇవే నా చివరి ఎన్నికలు అంటూ నితీష్ ప్రకటించారు.

అంతేకాకుండా తన రాజకీయ జీవితానికి ఈ ఎన్నికలతో రిటైర్మెంట్‌ పలుకుతున్నా. అంటూ ఉద్వేగంతో ఆయన బహిరంగసభలో పేర్కొన్నారు.

ఇటీవల బీహార్ లో రెండో దశ పోలింగ్ ముగిసిన విషయం విదితమే.అయితే ఆఖరిదైన మూడో దశ నవంబర్‌ 7న జరగనుండగా ఈ నేపథ్యంలో ఆయన బహిరంగ సభలో పాల్గొని ప్రజల నుద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇప్పటికే తోలి,రెండో దశ ఎన్నికలు ముగియగా, మూడో దశ పోలింగ్ నవంబర్ 7 న జరగనుండగా, ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్‌ 10న వెలువడనున్నాయి.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
అమెరికాలో భారత సంతతి గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ .. ఎఫ్‌బీఐ చీఫ్ కాష్ పటేల్ కీలక వ్యాఖ్యలు

దీనితో బీహార్ లో నితీష్ కుమార్ ప్రభుత్వం మరోసారి ఎక్కుతుందా లేదంటే తేజస్వి యాదవ్ యొక్క మహాకూటమి అధికారంలోకి వస్తుందా అన్నది తేలనుంది.

Advertisement

తాజా వార్తలు