ఆ బుల్లితెర నటికి హీరో కన్నా ఎక్కువ డబ్బులిచ్చారట.. కారణం?

సాధారణంగా సెలబ్రిటీలు అంటే పడిచచ్చే వాళ్ళు ఎంత మంది ఉన్నారో సెలబ్రిటీలను చులకనగా చూసేవారు, సెలబ్రిటీలను బాడీ షేమింగ్ విషయంలో ఎగతాళి చేసే వారు చాలా మంది ఉన్నారు.

ఇంకా చెప్పాలి అంటే సెలబ్రిటీలు అంటే ఇష్టపడే వారి కంటే వారిని చులకనగా చూసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని చెప్పవచ్చు.

హీరోయిన్ ల విషయానికి వస్తే సన్నగా ఉంది అని, బక్కచిక్కి పోయిందని, లావుగా ఉంటే బొద్దుగా ఉంది అని, పొడవుగా ఉంటే పొడవుగా ఉంది అని ఇలా హీరోయిన్లను ఎంతోమంది నానా మాటలు అంటూ ఉంటారు.కానీ సెలబ్రిటీలు ఇలాంటి మాటలు పట్టించుకోకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్తుంటారు.

అయితే అలా బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్న వారిలో హిందీ బిగ్ బాస్ సీజన్ 15 విన్నర్ తేజస్వి ప్రకాష్ కూడా ఒకరు.ఈమె నాగిని సీరియల్ లో కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తేజస్వి ప్రకాష్ కూడా బాడీ షేమింగ్‌ విషయంలో ఎన్నో మాటలను ఎదుర్కొంది.బాడీ షేమింగ్‌ గురించి తేజస్వి ప్రకాష్ మాట్లాడుతూ.

Advertisement

కేవలం బరువు ఎక్కువగా ఉన్న వారిని మాత్రమే కాకుండా, స్లిమ్ గా బక్కగా ఉన్న వారిని కూడా బాడీ షేమింగ్‌ చేస్తారు అని చెప్పుకొచ్చింది.నేను కూడా నా కెరీర్ మొదట్లో అలాంటి నెగిటివ్ కామెంట్ ఎదుర్కొన్నాను.

అటువంటి సమయంలో నాకు కూడా బాడీ పర్ఫెక్ట్ గా కనిపించేందుకు సర్జరీ చేయించుకుంటే బాగుండు అనిపించింది అని చెప్పుకొచ్చింది తేజస్వి ప్రకాష్.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఆ విధంగా చేయడంతో ఆమె కూడా అలాగే చేయాలి అని భావించిందట.కానీ ఇతరుల కామెంట్లతో నేనెందుకు మారాలి అని అనుకుందట.దేవుడు ఏ విధంగా అయితే నన్ను పుట్టించాడు నేను అలాగే ఉండాలి అనుకున్నాను అని చెప్పుకొచ్చింది తేజస్వి ప్రకాష్.

అదేవిధంగా నా బాయ్ ఫ్రెండ్ కూడా నేను లడ్డూలా ఉంటే ఇష్టపడతారు కాబట్టి నేను ఎవరికోసమో నా బాడీ నేను మార్చుకోను అని తెలిపింది తేజస్వి ప్రకాష్.

దేవుడా.. ఏంటి భయ్యా ఈ కేటుగాళ్లు ఏకంగా ఫేక్ బ్యాంకునే పెట్టేసారుగా!
దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?

అనంతరం ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ ఒకసారి హీరో కంటే ఆమెకి ఎక్కువ డబ్బులు ఇచ్చారట.ఎందుకంటే ఆ సమయంలో వారు ఆమెనే యాడ్ చేయాలి అని కోరుకోవడం తో అందుకే అంత పెద్ద మొత్తంలో హీరో కంటే ఎక్కువగా ముట్ట చెప్పారట.మొత్తంగా చూసుకుంటే పనిలో నైపుణ్యాన్ని బట్టి మీకు డబ్బులు చెల్లిస్తారు అని చెప్పుకొచ్చింది తేజస్వి ప్రకాష్.

Advertisement

.

తాజా వార్తలు