ఏడు వారాల నగలు అంటే ఏమిటో చాలా మందికి తెలియదు.పేరు వినడమే కాని చూసిన వాళ్లు కూడా చాలా తక్కువే.
అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.ఏడు వారాలు అంటే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనిలకు సంబంధించిన.
ఆ రోజుల్లో ఆయా దేవుళ్లకు ఇష్టమైన నగలే ఏడు వారాల నగలు.అయితే ఆది వారం.
సూర్యుడికి ఇష్టమైన ఈ రోజున కెంపుల కమ్మలు, హారాలు ధరించాలి.సోమ వారం చంద్రుడికి ఇష్టమైన ఈ రోజున ముత్యాల హారాలు, గాజులు పెట్టుకోవాలి.
మంగళ వారం కుజుడుకి ఇష్టమైన పగడాల దండలు, ఉంగరాలు అలంకరించుకోవాలి.
బుధవారం రోజు బుధునికి ఇష్టమైన పచ్చల పతకాలు, గాజులు వేసుకోవాలి.
గురు వారం బృహస్పతి కి ఇష్టమైన ఈ రోజున పుష్ప రాగపు కమ్మలూ, ఉంగరం చేయించుకోవాలి.శుక్ర వారం రోజు శుక్రునికి ఇష్టమైన ఈ రోజున వజ్రాల హారాలు, ముక్కు పుడక ధరించి లక్ష్మీ దేవిలా మీ వాళ్లకు దర్శనం ఇవ్వాలి.
శని వారం రోజు శనికి ఇష్టమైన నీల మణితో చేయించుకున్న కమ్మలూ, హారాలు, ముక్కు పుడకా ధరించాలి.ఇవీ ఏడు వారాల నగలు.ఆయా రోజుల్లో ఆయా నవ రత్నాలతో పాపిడి బిళ్ల, వంకీలూ ఇలా ఎన్నయినా చేయించుకోవచ్చు.ఆ రోజు ఆ రత్నం సంబంధించినవి బంగారంతో చేయించి పెట్టుకోవడ మంటే అంతకు మించిన వైభోగం ఇంకేమీ ఉండదు.