ఎప్పుడు ఏదో ఒక విషయంలో వివాదాన్ని తట్టి లేపే నటి మాధవి లత( Madhavi Lata ) తాజాగా ప్రభాస్ పై( Prabhas ) ఫైర్ అయినట్లు కనిపించింది.దీంతో ఆమె ప్రభాస్ పై మండిపడటంతో ప్రభాస్ అభిమానులు తిరిగి ఆమెపై ఘోరంగా కామెంట్లు పెడుతున్నారు.
ఇంతకు ఆమె ఏ విషయంలో ఆయనపై ఫైర్ అయిందా ఇప్పుడు తెలుసుకుందాం.మామూలుగా ఒక సినిమా చేసినప్పుడు ఆ సినిమాకు సంబంధించిన బాధ్యత దర్శకుడికే కాకుండా హీరోకి, నిర్మాతకు కూడా ఉంటుంది.
ఏదైనా పొరపాటు జరిగినా కూడా ముగ్గురిపై పడుతుంది.అయితే తాజాగా విడుదలైన ఆదిపురుష్ సినిమా( Adipurush Movie ) విషయంలో దర్శకుడికి బాగా చివాట్లు ఎదురవుతున్నాయి.
కారణం సినిమా బాలేనందుకు ఆయనపై ప్రేక్షకులు బాగా విమర్శలు, నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు.ఆయనను బాగా టార్గెట్ చేసి రకరకాల మీమ్స్ తో ట్రోల్స్ చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమాపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా రాజమౌళి( Rajamouli ) కూడా ఈ సినిమా గురించి కొన్ని విమర్శలు చేసినట్లు కొన్ని వార్తలు అయితే వచ్చాయి.
ఇందులో ప్రభాస్ లుక్ రాముడిలాగా కాకుండా జీసస్ లాగా ఉందని.అంతేకాకుండా రావణుడు పది తలలు గుండ్రంగా ఉన్నాయని.
ఇక ఓ వానరుడు అచ్చం అల్లు అర్జున్ లాగా ఉన్నాడు అని ఇలా రకరకాలుగా కామెంట్లు అయితే వినిపించాయి.
దీంతో సినిమా ప్లాఫ్ అయిందని ఒకవైపు టాక్ అయితే వచ్చింది.కొన్ని చోట్ల ఈ సినిమా కొందరి మనోభావాలు దెబ్బ తినటంతో బ్యాన్ కూడా చేసినట్లు తెలిసింది.అలా ఈ సినిమా కథను చూపించడంలో దర్శకుడు ఓం రౌత్ విఫలం కావడంతో ఆయనను బాగా తిడుతున్నారు.
అయితే తాజాగా ఒకప్పటి హీరోయిన్ మాధవిలత కూడా ఈ సినిమా పట్ల విమర్శలు చేయడమే కాకుండా.హీరో ప్రభాస్ పై మండిపడింది.
తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో స్టోరీస్ రూపంలో ఈ సినిమా గురించి విమర్శలు చేస్తూ కనిపించింది.అందులో రావణుడు సీతను అపహరించే సీన్ గురించి మాట్లాడుతూ.ఒరేయ్ దరిద్రుడా ఇదేమన్నా అపహరణ.లేక దయ్యం పట్టిందారా ఓం రౌత్ రావణ్ హా డైరెక్టర్ నేమ్ వాడి పైత్యం అని షేర్ పంచుకుంది.
ఇక మరో స్టోరీలో ఆది పురుష్ మ్యాటర్ లో అందరూ డైరెక్టర్ ని దొబ్బుతున్నారు.హీరో మ్యాటర్లో సైలెంట్ అయ్యారు.హీరోకి బాధ్యత లేదా?? స్టోరీ వినేటప్పుడు.తీసేటప్పుడు.
డైలాగ్ చెప్పేటప్పుడు.తను ఏమైనా కొత్త హీరోనా.
డైరెక్టర్ ఏం చెప్తే అది చేయడానికి.హీరో చెప్పినట్లే కదా డైరెక్టర్ వింటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ తిడితే తిట్టుకోండి.హీరో తప్పు 50% ఉంది.
ఏం రామాయణం చేసేటప్పుడు రామాయణం తెలుసుకోరా? నిష్ట లేదా బాధ్యత లేదా అంటూ ప్రశ్నించింది.దీంతో ఆమె ప్రభాస్ ను కూడా విమర్శించడంతో ఆయన అభిమానులు ఈమెపై తిరిగి మండిపడుతున్నారు.