ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలలో మనం వాటితో కూల్ డ్రింక్( Cool drink ) తయారు చేసుకొని తాగుతూ ఉంటాం.ఇలా తయారు చేసుకొని తాగడం వలన ఎండ నుండి ఈజీగా ఉపశమనం లభిస్తుంది.
అలాగే చక్కటి ఆరోగ్యాన్ని ఈజీగా సొంతం చేసుకోవచ్చు.అయితే ఈ డ్రింక్ ని తాగడం వలన చలువ చేస్తుంది.
అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు కూడా లభిస్తాయి.మనకు అందుబాటులో ఉండే పదార్థాలతో చేసుకున్న ఈ హెల్తీ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలి? దాన్ని తయారు చేసుకోవడానికి ఎలాంటి పదార్థాలు కావాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ హెల్తీ డ్రింక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పాలు( milk ) అర లీటర్ ,నానబెట్టిన బాదంపప్పు( Almond ), కస్టర్డ్ పౌడర్( Custard powder) ఒక టేబుల్ స్పూన్, పంచదార నాలుగు టేబుల్ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, నానబెట్టిన సబ్జా గింజలు తీసుకోవాలి.ఈ హెల్తీ డ్రింక్ తయారీ విధానం: ముందుగా బాదం పప్పుని తీసుకొని దానిపై ఉండే పొట్టును తీసి బాదం గింజలను ఒక జార్ లో తీసుకోవాలి.ఆ తర్వాత అందులో కస్టర్డ్ పౌడర్, నీళ్లు పోసి పలుకులు లేకుండా బాగా మెత్తగా మిక్సీ పట్టాలి.ఆ తర్వాత కళాయిలో పాలు పోసి వేడి చేయాలి.
ఆ పాలు పొంగు వచ్చిన తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.ఇక ఆ తర్వాత అందులో యాలకుల పొడి, పంచదార, డ్రై ఫ్రూట్స్ ( sugar, dry fruits )వేసి బాగా కలపాలి.ఇక ఈ పాలను నాలుగు నిమిషాల పాటు అలాగే కలుపుతూ మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.ఇక పూర్తిగా చల్లారిన తర్వాత సబ్జా గింజలు వేసి కలపాలి.
ఇలా తయారు చేసుకున్న కూల్ డ్రింక్ ను రెండు గంటల పాటు ఫ్రీజ్ లో ఉంచి చల్లగా అయిన తర్వాత తీసుకోవాలి.లేదా ఐస్ క్యూబ్ వేసి అప్పటికప్పుడే తీసుకోవచ్చు.
ఈ విధంగా పాలు ఇంకా బాదంపప్పుతో తయారు చేసిన ఈ డ్రింక్ ను తాగడం వలన రుచితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యం మన సొంతమవుతుంది.