జీ తెలుగు డ్రామా జూనియర్స్ సీజన్ 7 ఆడిషన్స్ ఏప్రిల్ 07న, మన హైదరాబాద్లో!

హైదరాబాద్, 03 ఏప్రిల్ 2024: ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు ఎల్లప్పుడూ ముందుండే జీ తెలుగు( Zee Telugu ) మరోసారి తన సక్సెస్ఫుల్ షో డ్రామా జూనియర్స్( Drama Juniors ) సరికొత్త సీజన్‌తో మీ ముందుకు వచ్చేస్తోంది.తెలుగు రాష్ట్రాల్లోని పిల్లల్లోని నటనా ప్రతిభను వెలుగులోకి తెచ్చే లక్ష్యంతో డ్రామా జూనియర్స్ సీజన్ 7( Drama Juniors Season 7 ) ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

 Zee Telugu Drama Juniors Season 7 Auditions On 07th April In Hyderabad, Zee Telu-TeluguStop.com

ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్‌లను పూర్తి చేసుకున్న డ్రామా జూనియర్స్ మరో సీజన్తో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.అంతేకాదు ప్రతిభగల పిల్లలని ఆడిషన్స్కి ఆహ్వానిస్తోంది.– డ్రామా జూనియర్స్ సీజన్‌ 7 కోసం తెలుగు రాష్ట్రాల్లో నటనపై ఆసక్తిగల చిన్నారులకు అద్భుత అవకాశం అందిస్తోంది.

3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లలు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు చక్కని అవకాశం అందిస్తోంది జీ తెలుగు.మీ పిల్లలకు నటనపై ఆసక్తి ఉంటే తప్పకుండా ప్రోత్సహించి వారి భవిష్యత్తుకు బాటలు వేయండి.విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు డ్రామా జూనియర్స్తో పాటు చక్కగా పాటలు పాడి అలరించే పిల్లలకోసం ఆన్గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహించనుంది.

నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, మార్షల్ ఆర్ట్స్, మ్యాజిక్ లో ప్రవేశం ఉన్న పిల్లలకూ అద్భుత అవకాశం అందిస్తోంది.ఈ ఆడిషన్స్ ఆదివారం (ఏప్రిల్ 07న) శ్రీ సారథీ స్టూడియోస్, అమీర్పేట, హైదరాబాద్ నందు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఆడిషన్‌లు నిర్వహించబడతాయి.

ఏవైనా సందేహాలు ఉంటే 9100054301 నెంబర్కి కాల్ చేయవచ్చు.‌‌

మీ పిల్లల్లోని ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు ఈ ఆదివారం, ఏప్రిల్ 07న హైదరాబాద్ వచ్చేస్తోంది మీ జీ తెలుగు!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube