అలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.. పాయల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ నటి పంజాబీ బ్యూటీ పాయల్ రాజ్ పుత్( Payal Rajputh ) గురించి మనందరికీ తెలిసిందే.అజయ్ భూపతి( Ajay Bhupathi ) దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది ఈ బ్యూటీ.

 Mangalavaram Actress Payal Rajput Criptic Post Goes Viral Instagram, Payal, Paya-TeluguStop.com

ఈ సినిమాతో మంచి సక్సెస్ ని కూడా అందుకుంది.ఇక ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించిన కూడా అంత సక్సెస్ అందుకోలేకపోయింది.

ప్రస్తుతం కేవలం అడపాదడపా సినిమాలలో నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ.ఆ సంగతి అటు ఉంచితే పాయల్ ఇటీవల నటించిన చిత్రం మంగళవారం.

పాయల్ చివరగా ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అజయ్ భూపతి డైరెక్షన్‌లో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది.అయితే పాయల్ టాలీవుడ్‌లో అంతకుముందు ఆర్డీఎక్స్‌ లవ్‌, వెంకీమామ, డిస్కోరాజా, తీస్‌ మార్‌ఖాన్‌, జిన్నా చిత్రాల్లో కనిపించింది.మంగళవారం మూవీతో ( mangalavaram )సూపర్‌ హిట్ తన ఖాతాలో వేసుకున్న పాయల్ తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

పాయల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.ఎవరైతే మిమ్మల్ని కిందకు లాగేందుకు ప్రయత్నిస్తారో అలాంటివారికి దూరంగా ఉండండి.

అలాగే పరిష్కారం సాధ్యం కానీ సమస్యలకు దూరంగా వెళ్లండి.మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారిని దూరం పెట్టండి.మీకు ఏదైతే హానికరంగా భావిస్తారో వాటన్నింటికీ దూరంగా ఉండటమే మంచిది.అంతే కాదు ఆరోగ్యానికి మంచిది కూడా అని రాసుకొచ్చింది పాయల్.ఈ సందర్బంగా పాయల్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube