తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ వరుస సినిమాలను చేస్తూ ముందు దూసుకెళ్తుంటారు.ఇక స్టార్ హీరోలుగా వెలుగొందుతున్నారు ఇక మరికొందరు మాత్రం మీడియం రేంజ్ హీరోలుగా తమదైన రీతిలో తమకు తోచిన సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతూ ఉంటారు.
ఇక రీసెంట్ గా శ్రీకాంత్( Srikanth ) లాంటి నటుడు చాలారోజుల తర్వాత కోటబొమ్మాలి పిఎస్( Kotabommali PS ) అనే సినిమాతో ఒక సక్సెస్ సాధించాడు.ఇక దీంతో శ్రీకాంత్ మార్కెట్ మరోసారి బాగా విస్తరించే అవకాశం అయితే ఉంది.
ఇక దీంతో ఆయన సోలో హీరోగా కూడా థ్రిల్లర్స్ లాంటి సినిమాల్లో మళ్ళీ కనిపించే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి… ఇక శ్రీకాంత్ ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా వస్తున్న దేవర సినిమాలో( Devara ) కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు ఇక దీంతోపాటుగా ఒక కొత్త డైరెక్టర్ డైరెక్షన్ లో మరొక కొత్త సస్పెన్స్ థ్రిల్లర్( Suspense Thriller ) జానర్ లో వచ్చే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే తను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు.దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు మంచి సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.
ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్న శ్రీకాంత్ మధ్యలో కొద్ది రోజులు ఆయన మార్కెట్ అనేది చాలా డీలా పడిపోయింది.ఇక దాంతో సోలో హీరోగా సినిమాలు చేసే అవకాశాలు రాలేదు ఇక ఇప్పుడు మాత్రం కోట బొమ్మాళి పి ఎస్ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ లో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో 100% సక్సెస్ అయ్యాడు…ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడం తో శ్రీకాంత్ కి మరిన్ని అవకాశాలు అతన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి…
.