కేసీఆర్‌కు పెద్ద షాక్‌.. త్వ‌ర‌లోనే పెద్ద ఎత్తున ఉద్య‌మం జ‌ర‌గ‌నుందా..?

కేసీఆర్‌కు ఉద్య‌మంలో అండ‌గా నిలిచింది నిరుద్యోగులే.యూత్ స‌హాయంతోనే కేసీఆర్ ఉద్య‌మాన్ని అంత పెద్ద ఎత్తున నిర్వ‌హించారు.

కేసీఆర్ ఏ పిలుపు ఇచ్చినా దాన్ని నిర్వ‌హించ‌డంలో యూత్ పాత్ర‌నే కీల‌కం.అలాంటి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆ యూత్ దూర‌మైపోయారు.

నిజంగా చెప్పాలంటే కేసీఆర్ ఇచ్చిన ప్ర‌ధాన హామీ అయిన ల‌క్ష ఉద్యోగాల నియామ‌కాలు చేయ‌క‌పోవ‌డంతో యూత్ మొత్తం టీఆర్ ఎస్ పై తీవ్రంగా భ‌గ్గుమంటున్నారు.దీంతో ఆల్ట‌ర్‌నేటివ్ గా బీజేపీ వారిని ఆక‌ట్టుకునేందుకు ప్ర‌య‌త్నించి బాగానే స‌క్సెస్ అయింది.

ఇక అప్ప‌టి నుంచి యూత్‌లో టీఆర్ ఎస్‌పై ఆశ‌లు స‌న్నగిల్లాయి.కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణ‌య‌మైనా కూడా యూత్‌లో ఫెయిల్ అయ‌పోతోంది.

Advertisement
Big Shock To KCR Will A Large Scale Movement Take Place Soon, KCR, Politics. Osm

ఇక రీసెంట్ గా అయితే యూత్ మ‌రీ ముఖ్యంగా నిరుద్యోగులు టీఆర్ ఎస్ నేత‌ల‌కు పెద్ద ఎత్తున షాక్ ఇస్తున్నారు.ఇక ఇప్పుడు మ‌రో ఉద్య‌మానికి ఉస్మానియా నిరుద్యోగులు తెర‌లేపారు.

అదేంటంటే నిరుద్యోగ యూత్ మొత్తం పార్టీల‌కు అతీతంగా ఇప్పుడు ఒక్క‌ట‌వుతున్నారు.రీసెంట్ గా వీరంతా కూడా ఆన్‌లైన్‌లోనే మీటింగ్ ఏర్పాటు చేసుకుని నిరుద్యోగ జేఏసీగా ఏర్పాటు అయ్యారు.

Big Shock To Kcr Will A Large Scale Movement Take Place Soon, Kcr, Politics. Osm

ఇక త్వ‌ర‌లోనే వారు మ‌రో ఉద్య‌మానికి పిలుపునిస్తున్నారు.ఇప్ప‌టికే ఉద్యోగాల కోసం దాదాపుగా 35ల‌క్ష‌ల మంది వ‌ర‌కు రిజిస్ట‌ర్ చేసుకున్నార‌ని, ఇక వారికి ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో వారంతా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.ఇక నిరుద్యోగ భృతి కూడా ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇప్పుడు ప్ర‌తి ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కార్య‌క్ర‌మాలు కూడా మొద‌లు పెట్ట‌బోతున్నారు.అయితే వీటికి అటు ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా బాగానే స‌పోర్టు చేస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది.

ఇదేం కాంప్లిమెంట్ రా బాబోయ్.. పొగిడినట్టే పొగిడి భారతీయులను అవమానించిన ఆస్ట్రేలియా కపుల్..
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 26, శుక్రవారం 2023

ఇలా అయితే టీఆర్ ఎస్‌కు ఇది భ‌విష్య‌త్‌లో పెద్ద దెబ్బ కొట్టే ప్ర‌మాదం లేక‌పోలేదు.మ‌రి కేసీఆర్ వీరిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు