బాలయ్య సినిమాలో ఆ హీరోయిన్ లేదట!

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా, ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడింది.

కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో పలువురు నటీనటులు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్.

వీరిలో నటి భూమిక పేరు ముందుగా వినిపించింది.గతంలో బాలయ్య నటించిన రూలర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన భూమిక ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.

ఇక ఈ సినిమాలో ఆమె ఏకంగా విలన్ పాత్రలో నటిస్తుందనే వార్త కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది.కానీ ఇవేమీ నిజమైన వార్తలు కాదని తెలుస్తోంది.

Advertisement

ఈ సినిమాలో భూమిక నటించడం లేదని తాజాగా బోయపాటి శ్రీను తెలిపాడు.దీంతో ఈ సినిమాలో భూమిక ఎలాంటి పాత్రలో నటించడం లేదని తేలిపోయింది.

ఇక గతంలో హీరోయిన్‌గా పలు సక్సెస్‌ఫుల్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, ఎంసీఏ చిత్రం నుండి క్యారెక్టర్ పాత్రల్లో కూడా అదరగొడుతోంది.

Advertisement

తాజా వార్తలు