బాలయ్య సినిమాలో ఆ హీరోయిన్ లేదట!
TeluguStop.com
బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకాగా, ప్రస్తుతం నెలకొన్న లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడింది.
కాగా ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో పలువురు నటీనటులు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్.
వీరిలో నటి భూమిక పేరు ముందుగా వినిపించింది.గతంలో బాలయ్య నటించిన రూలర్ చిత్రంలో కీలక పాత్రలో నటించిన భూమిక ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని వార్తలు వచ్చాయి.
ఇక ఈ సినిమాలో ఆమె ఏకంగా విలన్ పాత్రలో నటిస్తుందనే వార్త కూడా ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొట్టింది.
కానీ ఇవేమీ నిజమైన వార్తలు కాదని తెలుస్తోంది.ఈ సినిమాలో భూమిక నటించడం లేదని తాజాగా బోయపాటి శ్రీను తెలిపాడు.
దీంతో ఈ సినిమాలో భూమిక ఎలాంటి పాత్రలో నటించడం లేదని తేలిపోయింది.ఇక గతంలో హీరోయిన్గా పలు సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ, ఎంసీఏ చిత్రం నుండి క్యారెక్టర్ పాత్రల్లో కూడా అదరగొడుతోంది.
ఆ విషయంలో టాలీవుడ్ ఇంకా మారలేదు.. కాజల్ అగర్వాల్ షాకింగ్ కామెంట్స్!