పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా..!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు, కొరటాల శివల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘భరత్‌ అనే నేను’ చిత్రం విడుదలై రెండు వారాలు పూర్తి అయ్యింది.

ఈ చిత్రం దాదాపు 200 కోట్లకు చేరువలో ఉంది.

మరో రెండు మూడు రోజుల్లో 200 కోట్లను క్రాస్‌ చేయడం ఖాయం అని తేలిపోయింది.అయితే ఇంత భారీగా వసూళ్లు సాధిస్తున్నప్పటికి కూడా ఈ చిత్రంను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మరియు ఎగ్జిబ్యూటర్లు నష్టాల్లోనే ఉన్నట్లుగా ట్రేడ్‌ వర్గాల్లో సమాచారం అందుతుంది.

రెండు మూడు ఏరియాల్లో ఇంకా ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్‌ను ఒడ్డున పడేయలేదని తెలుస్తోంది.

డిస్ట్రిబ్యూటర్స్‌ లాంగ్‌ రన్‌లో సేఫ్‌ అయినా ఎగ్జిబ్యూటర్లు మాత్రం నష్టాలు చవి చూడాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది.భారీ స్థాయిలో అంచనాల నడుమ తెరకెక్కిన భరత్‌ అనే నేను చిత్రాన్ని దాదాపు 125 కోట్లకు అన్ని ఏరియాల్లో కొనుగోలు చేయడం జరిగింది.డిస్ట్రిబ్యూటర్లు అంతే మొత్తంలో ఎగ్జిబ్యూటర్లకు, బయ్యర్లకు అమ్మడం జరిగింది.

Advertisement

కొందరు బయ్యర్లు మహేష్‌బాబు అనే ఆశతో కాస్త ఎక్కువ మొత్తంను పెట్టి కొనుగోలు చేయడం జరిగింది.దాంతో ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

భరత్‌ అనే నేను చిత్రం పైకి చూడా 200 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను వసూళ్లు చేసినప్పటికి ఇప్పటి వరకు 100 కోట్ల షేర్‌ను క్రాస్‌ చేయలేదనే టాక్‌ వినిపిస్తుంది.నిర్మాత వద్ద డిస్ట్రిబ్యూటర్లు 125 కోట్ల మేరకు కొనుగోలు చేయడం జరిగింది.

లాంగ్‌ రన్‌లో ఈ చిత్రం 110 కోట్ల మేరకు రాబట్టే అవకాశం ఉందని తేలిపోయింది.అంటే డిస్ట్రిబ్యూటర్లకు 15 కోట్ల మేరకు నష్టం తప్పదనిపిస్తుంది.

అందులో బయ్యర్లు ఎక్కువగా నష్టపోతారనే టాక్‌ వినిపిస్తుంది.నైజాం ఏరియాలోని పలు జిల్లాల బయ్యర్లు భారీ మొత్తంకు ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడం జరిగింది.

ఆ ఒక్క సినిమా నా జీవితాన్నే మార్చేసింది... రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన .. ఆమెనూ తప్పిస్తున్నారా ? 

వారిలో ఎక్కువ శాతం మంది 30 నుండి 75 లక్షల మేరకు నష్టపోయే అవకాశం ఉందని సమాచారం అందుతుంది.ఇక గోదావరి జిల్లాలో కూడా బయ్యర్లు లక్షల్లో నష్టపోయే అవకాశం ఉంది.

Advertisement

కలెక్షన్స్‌ చూస్తే కోట్లలో ఉన్నాయి.టాలీవుడ్‌ నెం.3 గ్యారెంటీ అంటూ సినిమా యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.కాని సినిమా మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు మరియు బయ్యర్లకు పీడకల మాదిరిగా మిగిలే అవకాశం ఉందననిపిస్తుంది.

తాజా వార్తలు