వేస‌విలో పిల్ల‌ల చేత ఈ జ్యూస్‌ను తాగిస్తే.. వారి ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు!

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతోంది.ఎండ‌లు రోజురోజుకు ముదిరిపోతున్నాయి.

దాంతో ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు.

కానీ, పిల్ల‌లు మాత్రం బ‌య‌ట‌కు వెళ్లి స్నేహితుల‌తో ఆడుకోవ‌డానికే ఆరాట‌ప‌డుతుంటారు.

ఇంట్లో వారిని ఆప‌లేక త‌ల్లిదండ్రులు కూడా పిల్ల‌ల‌కు బ‌య‌ట‌కు వ‌దిలేస్తుంటారు.ఈ క్ర‌మంలోనే రోజంతా ఆట‌లు ఆడి ఆడి సాయంత్రానికి తీవ్రంగా నీర‌సించిపోతారు.

అలాగే అధిక ఎండ‌ల కార‌ణంగా డీహైడ్రేష‌న్‌, హీట్ స్ట్రోక్ వంటి స‌మ‌స్య‌లకు గుర‌య్యే అవ‌కాశాలు కూడా ఉంటాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను త‌ల్లిదండ్రులు పిల్ల‌ల చేత తాగిస్తే.

Advertisement

ఆయా స‌మ‌స్యల నుంచి ర‌క్ష‌ణ క‌ల్పించ‌వ‌చ్చు.అలాగే మ‌రెన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను అందించ‌వ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ జ్యూస్ ఏంటో, ఎలా త‌యారు చేసుకోవాలో.తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.వాట‌ర్ హీట్ అవ్వ‌గానే అందులో ఒక క‌ప్పు క్యారెట్ ముక్క‌లు, ఒక క‌ప్పు పీల్ తొల‌గించిన యాపిల్ ముక్క‌లు వేసి ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు ఉడికించుకుని చ‌ల్లార‌బెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఉడికించుకుని చ‌ల్లార‌బెట్టుకున్న యాపిల్‌, క్యారెట్ ముక్క‌ల‌ను వాట‌ర్‌తో స‌హా వేసేసుకోవాలి.ఆ త‌ర్వాత అందులో ఒక క‌ప్పు క‌ర్బూజ పండు ముక్క‌లు, రెండు టేబుల్ స్పూన్ల బ్రౌన్ షుగ‌ర్‌, రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక గ్లాస్ కాచి చ‌ల్లార్చిన పాలు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే జ్యూస్ రెడీ అవుతుంది.

వైరల్ : కొడుకు కోసం ఆ తండ్రి బిర్యానీతో పడిన కష్టం.. ఎమోషనల్ స్టోరీ..
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయనే ? 

ఈ జ్యూస్‌లో వ‌న్ టేబుల్ స్పూన్ నాన‌బెట్టిన స‌బ్జా గింజ‌లు వేసి పిల్ల‌ల చేత మార్నింగ్ టైమ్‌లో తాగిస్తే వారి ఆరోగ్యానికి ఢోకా ఉండ‌దు.ఎండ‌ల్లో వారు డీహైడ్రేష‌న్‌, హీట్ స్ట్రోక్ వంటి స‌మ‌స్యల బారిన ప‌డ‌కుండా ఉంటారు.పిల్ల‌ల‌కు ప్రోటీన్ పుష్క‌లంగా అందుతుంది.

Advertisement

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.మ‌రియు నీర‌సం, అల‌స‌ట వంటివి సైతం పిల్ల‌ల ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

తాజా వార్తలు