చెవి నొప్పి రెండు రోజుల్లో తగ్గాలంటే ఈ హోం రెమెడీ పాటించాల్సిందే ..

ఈ మధ్యకాలంలో చాలామందిలో చెవి సమస్యలు బాగా పెరిగిపోతున్నాయి.ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా శబ్ద కాలుష్యం బాగా పెరిగిపోతుంది.

ముందు ముందు వచ్చే రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చాలా మందిలో వినికిడి లోపాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.ఈ మధ్యకాలంలో డీజే శబ్దాల వల్ల చాలామందిలో ఈ వినికిడి లోపాలు ఇంకా పెరిగిపోతున్నాయి.

చెవి వ్యాక్స్, సైనస్ ఇన్ఫెక్షన్, చికాకు లాంటి సమస్యలు ఎన్నో వస్తున్నాయి.చెవికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

చెవి నొప్పి కోసం కొన్ని ఇంటి ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి.వాటిలో వెల్లుల్లి నూనె కూడా ఒకటి.

Advertisement

వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫర్మేటరీ గుణాలు ఎక్కువగా ఉంటాయి.కాబట్టి ఇవి వాపును చెవి నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

ఇంకా చెప్పాలంటే చెవి నొప్పిని తగ్గించడానికి ఒక మెత్తటి గుడ్డను తీసుకొని వేడినీటిలో దాన్ని కాసేపు ఉంచి 20 నుంచి 25 నిమిషాల పాటు చెవి నొప్పి ఉన్నచోట కంప్రెస్ చేస్తూ ఉండటం వల్ల చెవి నొప్పి తగ్గే అవకాశం ఉంది.

తులసి ఆకుల్లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి.వీటితోపాటు చెవి సమస్యను కూడా తులసి ఆకులు తగ్గించడానికి ఉపయోగపడతాయి.తులసి ఆకుల రసాన్ని తీసుకొని చెవిలో వేయడం వల్ల కొద్దిసేపట్లోనే నొప్పి తగ్గే అవకాశం ఉంది.

చెవి నొప్పి నుండి బయట పడాలంటే చెవుల పై ఒత్తిడి పడకుండా నిద్రపోవడం వల్ల నొప్పి త్వరగా తగ్గే అవకాశం ఉంది.చెవి నొప్పి ఇన్ఫెక్షన్ల నుండి వచ్చినట్లయితే వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల తగ్గిపోతుంది.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

నువ్వుల నూనెలో రెండు వెల్లుల్లి రెబ్బలను కలిపి వేడి చేసి చల్లార్చాలి.అలా చల్లార్చిన ఆ నూనెను ఒకటి లేదా రెండు చుక్కలు నొప్పిగా ఉన్న చెవిలో వేయడం వల్ల ఒక రెండు రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది.

Advertisement

తాజా వార్తలు