దానిమ్మ‌తో ఇలా చేస్తే.. జుట్టు వేగంగా పెరుగుతుంద‌ట తెలుసా?

దానిమ్మ పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అద్భుత‌మైన రుచి క‌లిగి ఉండే దానిమ్మ పండ్ల‌లో విట‌మిన్ సి, విట‌మిన్ బి, విట‌మిన్ కె, సిట్రిక్ యాసిడ్, పోటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు కూడా నిండి ఉంటాయి.

అందుకే రోజుకో దానిమ్మ పండు తింటే ఎన్నో జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చ‌ని వైద్యులు చెబుతుంటారు.అయితే ఆరోగ్యానికే కాదు.

కేశ సంర‌క్ష‌ణ‌లోనూ దానిమ్మ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా జుట్టు వేగంగా, ఒత్తుగా పెరిగేందుకు దానిమ్మ గ్రేట్‌గా స‌మాయ‌ప‌డుతుంది.

మ‌రి దానిమ్మను కేశాల‌కు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా దానిమ్మ గింజ‌ల‌ను మెత్త‌గా పేస్ట్ ర‌సం తీసుకోవాలి.

Advertisement

ఇప్పుడ ఈ దానిమ్మ ర‌సంలో బాదం నూనె వేసి బాగా మిక్స్ చేసి.త‌ల‌కు, కేశాల‌కు ప‌ట్టించాలి.

అర గంట నుంచి గంట పాటు వ‌దిలేసి ఆ త‌ర్వాత కెమిక‌ల్స్ త‌క్కువగా ఉండే షాంపూ యూజ్ చేసి.త‌ల స్నానం చేయాలి.

ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.వెంట్రుకల కుదుళ్లను బలం చేకూరుతుంది.

దాంతో మీ జుట్టు రాల‌డం త‌గ్గి.పొడ‌వుగా పెరుగుతుంది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

అలాగే దాలిమ్మ గింజ‌ల నుంచి ర‌సం తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మ ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, జుట్టుకు అప్లై చేసి.

Advertisement

అర గంట త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో హెడ్ బాత్ చేసేయాలి.ఇలా నాలుగు రోజుల‌కు ఒక సారి చేస్తూ ఉంటే.

జుట్టు వేగంగా పెర‌గ‌డంతో పాటు చుండ్రు స‌మ‌స్య కూడా దూరం అవుతుంది.ఇక దానిమ్మ గింజ‌ల నుంచి తీసుకున్న ర‌సాన్ని డైరెక్ట్‌గా త‌ల‌కు అప్లై చేసి.

అర గంట త‌ర్వాత త‌ల స్నానం చేయాలి.ఇలా చేసినా కూడా జుట్టు వేగంగా పెర‌గ‌డంతో పాటు నిగ నిగ‌లాడుతూ క‌నిపిస్తుంది.

తాజా వార్తలు