గొంతు కోసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలి:-PDSU,POW,PYL డిమాండ్

ప్రేమించాలని వేధిస్తూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనూష పై కత్తితో దాడి చేసిన మహమ్మద్ అజార్ ను కఠినంగా శిక్షించాలని పిడిఎస్ యూ, ,పివైఎల్ ,పిఓడబ్ల్యు, ఖమ్మం జిల్లా కమిటీ ల ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ముందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా పిడిఎస్ యు,పివైఎల్ , ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి లు వెంకటేష్, రాకేశ్,పిఓడబ్ల్యు జిల్లా సహాయ కార్యదర్శి ఝాన్సీ లు మాట్లాడుతూ మహిళలకు రక్షణ కల్పిస్తామంటూ ఎన్నో చట్టాలు తీసుకొస్తున్నారు తప్ప వారికి ఎటువంటి రక్షణ కల్పించడం లేదని దానికి నిదర్శనమే నిన్న వరంగల్ లో అనూష అనే విద్యార్థిపై, మహమ్మద్ అజార్ ప్రేమించాలని వేధిస్తూ గొంతు కోసిన దౌర్భాగ్య పరిస్థితి నేడు తెలంగాణ రాష్ట్రం కనిపిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రక్షణ కల్పించాల్సిన టువంటి చట్టాలు మరియు పోలీసు వ్యవస్థ నేడు రాజకీయ నాయకులకు చుట్టాలు గా మారిన దౌర్భాగ్య పరిస్థితి నేడు దేశంలో కనిపిస్తుందన్నారు.అనూష విద్యార్థిపై కత్తితో దాడి చేయడాన్ని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్య రాజన్ తమిళ సై స్పందించగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు స్పందించక పోవడం ఏంటి అని వారు ప్రశ్నించారు తక్షణమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అనూషకు మెరుగైన వైద్యం అందిస్తూనే, నిందితుని కఠినంగా శిక్షించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికైనా వెనకాడబోమని వారు వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో, పిడిఎస్ యు,పివైఎల్ ,పిఓడబ్ల్యు, ఖమ్మం జిల్లా నాయకులు , మంగతాయి, మోహన్ రెడ్డి , లక్ష్మణ్, చందు, రవీందర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

బిగ్ బాస్ 8 ఫినాలేలో సందడి చేసిన రామ్ చరణ్... రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Latest Khammam News