బర్రెలక్క డబ్బులు వసూలు చేస్తోందంటూ సంచలన ఆరోపణలు.. నిజం ఏంటంటే?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకీ బర్రెలక్క ( Barrelakka )అలియాస్ కర్నే శిరీష గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

సోషల్ మీడియా ద్వారా ఈమె బాగా ఫేమస్ అయిన విషయం తెలిసిందే.

డిగ్రీ చదువుకున్న ఈమె పొలాల్లో బర్రెలు కాస్తున్నాను అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్త బాగా వైరల్ అయింది.అప్పటినుంచి ఈమెను బర్రె లెక్కగా పిలవడం మొదలు పెట్టారు.

ఇక గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బర్రెలక్క పోటీ చేయడంతో ఆమె ఫేమ్ మరింత పెరిగింది.

Barrelakka Alias Karne Sirisha Condemns Fake News On Her, Barrelakka, Karne Siri

బర్రెలక్కకు సపోర్ట్ గా జేడీ లక్ష్మీ నారాయణ ప్రచారం చేయడం కొసమెరుపు.ఎలాంటి నేపథ్యం లేని సామాన్యురాలు బర్రెలక్క ఐదు వేలకు పైగా ఓట్లు సంపాదించి ఆశ్చర్యానికి గురి చేసింది.అనంతరం తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆమె పోటీ చేశారు.

Advertisement
Barrelakka Alias Karne Sirisha Condemns Fake News On Her, Barrelakka, Karne Siri

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8( Bigg Boss Telugu Season 8 )లో బర్రెలక్క కంటెస్ట్ చేస్తుందంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది.బిగ్ బాస్ హౌస్లో బర్రెలక్కను చూడొచ్చని ఆమె అభిమానులు ఆశపడుతున్నారు.

ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కానీ ఇప్పుడు అనూహ్యంగా బర్రెలక్క ఒక వివాదంలో ఇరుక్కుంది.

కన్నడ మీడియాలో ఆమెపై కథనాలు వెలువడుతున్నాయట.

Barrelakka Alias Karne Sirisha Condemns Fake News On Her, Barrelakka, Karne Siri

ఫేస్ బుక్ లో చాట్ చేసి బర్రెలక్క మగాళ్ల వద్ద డబ్బులు వసూలు చేస్తుందంటూ కొన్ని ప్రచారాలు చేయడం మొదలుపెట్టారు.అయితే ఈ విషయంపై నేరుగా బర్రెలక్క స్పందించింది.కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎస్పీతో మాట్లాడి ఆమె ఫిర్యాదు చేశారు.

'రుద్ర' గా ప్రభాస్ కొత్త పోస్టర్ వైరల్!
కూలీ కోసం బుట్ట బొమ్మ... కళ్ళు చెదిరే రేంజిలో రెమ్యూనరేషన్?

తన పేరున అనేక ఫేక్ ఐడీలు ఉన్నాయి.ఎవరో చేసిన దానికి నన్ను బలి చేస్తున్నారు.

Advertisement

నేను ఎలాంటి తప్పు చేయలేదు.పెళ్లి చేసుకుని హాయిగా ఉంటున్నాను.

అని బర్రెలక్క ఆవేదన చెందారు.ఈ వివాదంలో బర్రెలక్కకు ఆమె అభిమానులు అండగా నిలిచారు.

మీరు బాధపడకండి.పోలీసులకు ఫిర్యాదు చేయండి.

మీరు ఎలాంటి వారో మాకు తెలుసని మద్దతు ప్రకటిస్తున్నారు.

తాజా వార్తలు