గురుకుల డిగ్రీ విద్యార్థినులు ఉగ్రరూపం...!

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో సరైన వసతులు లేవని,హాస్టల్లో సరైన భోజనం పెట్టడడం లేదని అడిగితే ప్రిన్సిపాల్ కక్ష కట్టి విద్యార్థినులను వేధిస్తోందని ఆరోపిస్తూ ఈ ప్రిన్సిపాల్ ను వెంటనే తొలగించి,కొత్త ప్రిన్సిపాల్ ను నియమించాలని డిమాండ్ చేస్తూ కాలేజీ ఎదుట సూర్యాపేట-జనగామ ప్రధాన రహదారిపై గురువారం సుమారు 400 మంది విద్యార్థినులు ఉగ్రరూపం ధరించి ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న విద్యార్ది సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని వారికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లడుతూ కాలేజీలో అమ్మాయిలకు సరైన వసతులు లేవని,హాస్టల్లో భోజనం కూడా సరిగా లేదని అడిగిన వారిని వేధిస్తూ, దాడులు చేస్తూ తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుందని, పై అధికారులకు చెప్పకుండా అడ్డుకుంటూ బెదిరుస్తూ వస్తుందని,ప్రినిస్పాల్ వేధింపులు భరించలేక ఆందోళన చేపట్టాల్సి వచ్చిందన్నారు.విద్యార్ది సంఘాల నేతలు మాట్లడుతూ విద్యార్థినిలకు సరైన వసతులు కల్పించకుండా వేధింపులకు గురి చేస్తున్న ప్రిన్సిపల్ వెంటనే తొలగించి,కొత్త ప్రిన్సిపల్ ను నియమించాలని డిమాండ్ చేశారు.

విద్యార్థినుల ఆందోళనతో ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలిస్తుండగా విద్యార్థినులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.అక్కడికి చేరుకున్న నలగొండ రీజినల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి విద్యార్థినిలతో మాట్లాడుతూ హాస్టల్ లో జరుగుతున్న వాటిపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి తగిన విధంగా న్యాయం చేస్తామని, ప్రస్తుతం ఉన్న ప్రిన్సిపల్ ని విధుల నుండి సరెండర్ చేసి కొత్తగా ఇన్చార్జి ప్రిన్సిపల్ నియమిస్తున్నామని తెలిపడంతో ఆందోళన విరమించారు.

గురుకులంలో మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మళ్ళీ ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement
కుటుంబ డిజిటల్ కార్డులో ఎవరూ మిస్ కావద్దు : జిల్లా కలెక్టర్

Latest Suryapet News