బాలయ్యకు ఇది అవాటే.. కాని ఫ్యాన్స్‌ సిగ్గుతో చస్తున్నారు!

నందమూరి బాలకృష్ణ ఈ సంవత్సరం సంక్రాంతికి ‘జైసింహా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

తమిళ దర్శకుడు రవికుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయ్యింది.

డిజాస్టర్‌గా నిలిచిన ఆ సినిమా తర్వాత కాస్త గ్యాప్‌ తీసుకున్న బాలయ్య తన తదుపరి చిత్రాన్ని తన తండ్రి ఎన్టీఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించాలని భావించాడు.అందుకోసం దాదాపు మూడు నెలల పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ చేయించాడు.

దర్శకుడు తేజతో ఈ సినిమా చేయాలని భావించినా కూడా ఆ తర్వాత ఆయన్ను తప్పించాడు.ఇప్పుడు సినిమానే తప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది.

Balakrishna New Movie With Vv

‘ఎన్టీఆర్‌’ సినిమాకు దర్శకుడిని వెదకడంలో విఫలం అయిన బాలకృష్ణ తన సినిమాకు ఎక్కువ గ్యాప్‌ వస్తుందనే ఉద్దేశ్యంతో వినాయక్‌తో సినిమాను మొదలు పెట్టేందుకు సిద్దం అయ్యాడు.సి కళ్యాణ్‌ బ్యానర్‌లో వినాయక్‌ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నాడు.ఆ సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.

Advertisement
Balakrishna New Movie With Vv-బాలయ్యకు ఇది అవాట�

బాలయ్య, వినాయక్‌ల కాంబో మూవీని దసరాకు విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా సంగతి పక్కన పెడితే ఎన్టీఆర్‌ సినిమా విషయమై బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడో అంటూ అభిమాను మరియు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర సినిమా అనగానే ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం ప్రారంభోత్సవంకు వచ్చేందుకు ఆసక్తి చూపించాడు.జ్యోతి ప్రజ్వలించి మరీ సినిమాను లాంచనంగా ప్రారంభించాడు.

సినిమా ప్రారంభోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు.సినిమా ప్రారంభోత్సవ సన్నివేశం కూడా అందరికి గుర్తుండే ఉంటుంది.

అంతగా ఆర్బాటంగా సినిమాను ప్రారంభించిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పుడు సినిమాను పూర్తిగా అటకెక్కించే అవకాశం కనిపిస్తుందని సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.అంత భారీగా ప్రారంభోత్సవం చేసిన తర్వాత సినిమా ఆపేస్తే పరువు పోతుందని ఇతర హీరోలు అనుకుంటారు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సంపత్ నంది ఓదెల 2 మూవీ చేసి తప్పు చేశాడా..?

కాని బాలయ్యకు మాత్రం అలాంటి పట్టింపులు ఏమీ లేవు.గతంలో ఈయన ఎన్నో చిత్రాలను ప్రారంభించి పక్కకు పెట్టేశాడు.

Advertisement

తాజాగా ఈ సినిమా పరిస్థితి కూడా అదే అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.బాలయ్యకు ఇలాంటివి అలవాటే కాని, ఆయన ఫ్యాన్స్‌ మాత్రం ఇతర హీరోల ఫ్యాన్స్‌ ముందు తలెత్తుకోలేక సిగ్గుతో చస్తున్నారు.

ఈ విషయాన్ని స్వయంగా నందమూరి ఫ్యాన్స్‌ ఆఫ్‌ ది రికార్డ్‌గా చెబుతున్నారు.ఇప్పుడు కాకున్నా వచ్చే సంవత్సరంలో అయినా ఎన్టీఆర్‌ సినిమాను బాలయ్య చేయాలని వారు కోరుకుంటున్నారు.

మరి బాలయ్య ఏం చేస్తాడో చూడాలి.

తాజా వార్తలు