నీతులు చెబుతున్న బాలయ్య.. అసలు కథ వేరయ్య!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

డిజాస్టర్‌ మూవీ రూలర్‌ తరువాత బాలయ్య ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

అటు బోయపాటి కూడా వినయ విధేయ రామ తరువాత ఖచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.ఈ క్రమంలో బాలయ్యతో కలిసి మూడోసారి జతకట్టిన ఈ దర్శకుడు అదిరిపోయే కథను రెడీ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కోసం బాలయ్య తాజాగా గుండుతో దర్శనమివ్వడంతో అందరూ అవాక్కవుతున్నారు.బాలయ్య ఎలాంటి పాత్ర చేస్తున్నాడు.

అసలు కథ ఏమిటి అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.అయితే చిత్ర వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో బాలయ్య ఓ ఆధ్యాత్మికవేత్తగా కనిపిస్తాడట.

Advertisement

ఫస్టాఫ్‌లో కనిపించే ఈ పాత్ర కోసమే బాలయ్య గుండు చేసుకున్నట్లు తెలుస్తోంది.వైవిధ్యమైన పాత్రే కాకుండా ప్రేరణాత్మకంగా ఉంటుందని తెలుస్తోంది.

ఇక సెకండాఫ్‌లో బాలయ్యను పవర్‌ఫుల్‌గా చూపించనున్నాడట బోయపాటి.పవర్‌ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్య తన విశ్వరూపాన్ని చూపిస్తాడట.

ఈ సినిమాతో మరోసారి బాలయ్య మాస్ ప్రేక్షకులను కట్టిపడేయటం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్.కాగా ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో కనిపిస్తాడు.

శబరి మూవీ రివ్యూ: మదర్ సెంటిమెంట్ మాములుగా లేదుగా!
Advertisement

తాజా వార్తలు