ఓవర్సీస్ లో దారుణంగా ఉన్న 'భగవంత్ కేసరి' అడ్వాన్స్ బుకింగ్స్..ఎన్ని టికెట్స్ అమ్ముడుపోయాయంటే!

దసరా వచ్చేస్తుంది.సంక్రాంతి పండుగ తర్వాత మన తెలుగు ఆడియన్స్ కి దసరా పండగ ఎంత పెద్దదో, టాలీవుడ్ కి కూడా అంతే.

ఈ సీజన్ లో కనీసం రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ అయినా విడుదల అయ్యేందుకు లైన్ లో ఉంటాయి.అలా ఈ ఈసారి తమిళ హీరో విజయ్ నటించిన లియో, బాలయ్య బాబు నటించిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) మరియు రవితేజ హీరో గా నటించిన టైగర్ నాగేశ్వర రావు చిత్రాలు విడుదల అవ్వబోతున్నాయి.

ఈ మూడు సినిమాలకు మార్కెట్ లో ఉన్న క్రేజ్ మామూలుది కాదు.కాసేపటి క్రితమే బాలయ్య బాబు భగవంత్ కేసరి మూవీ ట్రైలర్ విడుదల అయ్యింది.

రెస్పాన్స్ అదిరిపోయింది.బాలయ్య బాబు ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోబోతున్నాడు అని అభిమానులకు అర్థం అయ్యింది.

Advertisement
Balakrishna Bhagavanth Kesari Vs VIjay Leo Movie Premiere Show Tickets,Balakrish

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యింది.ఒకసారి ఆ ట్రెండ్ ఎలా ఉందో చూద్దాం.

Balakrishna Bhagavanth Kesari Vs Vijay Leo Movie Premiere Show Tickets,balakrish

బాలయ్య( Balakrishna ) గత చిత్రం వీర సింహా రెడ్డి కి నార్త్ అమెరికా లో దాదాపుగా 7 లక్షల 50 వేల డాలర్లు కేవలం ప్రీమియర్ షోస్ నుండే వచ్చాయి.ఇది బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్.కానీ భగవంత్ కేసరి చిత్రానికి మాత్రం అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు.

ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించి 550 షోస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభిస్తే, వాటి నుండి కేవలం 38 వేల డాలర్లు మాత్రమే వచ్చాయి.ఇది చాలా స్లో ట్రెండ్ అని చెప్పొచ్చు.

తమిళ హీరో విజయ్ లియో( Hero Vijay Leo ) తెలుగు దబ్ వర్షన్ కి దీనికంటే ఎక్కువ గ్రాస్ వచ్చింది.అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకి 60 వేల డాలర్స్ కి పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

వైరల్ అవుతున్న ఎన్నారై జంట ఫైనాన్షియల్ ప్లాన్.. వారి సీక్రెట్ తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
డైనోసార్ బొమ్మ తుపాకీతో బ్యాంకు దోపిడీకి యత్నం.. దొంగ వెర్రితనానికి నవ్వాపుకోలేరు!

అంటే భగవంత్ కేసరి కి డబుల్ అన్నమాట.

Advertisement

ఇప్పటి వరకు భగవంత్ కేసరి చిత్రానికి 1600 టికెట్స్ అమ్ముడుపోగా, లియో చిత్రానికి దాదాపుగా 3000 టికెట్స్ అమ్ముడుపోయాయి.ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని చూస్తూ ఉంటే ఆగస్టు లో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి డిజాస్టర్ ఫ్లాప్ చిత్రం భోళా శంకర్ కంటే కూడా ఈ సినిమాకి ప్రీమియర్ షోస్( Bhagavanth Kesari Premiere Shows ) ) నుండి తక్కువ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు.భోళా శంకర్ చిత్రానికి ప్రీమియర్ షోస్ నుండి నాలుగు లక్షల డాలర్స్ కి పైగానే గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

కానీ భగవంత్ కేసరి చిత్రానికి రెండు లక్షల గ్రాస్ వసూళ్లు కూడా వచ్చేలా కనిపించడం లేదు.ఈరోజు ట్రైలర్ విడుదల అయ్యింది కాబట్టి , రేపటి నుండి ట్రెండ్ ఏమైనా మరుంటుందేమో చూడాలి .

తాజా వార్తలు